- ఇప్పట్లో చిన్న వయసులోనే తెల్లజుట్టు
- ఓ తెల్ల వెంట్రుక కనిపిస్తే వెంటనే పీకేస్తున్నారా?
- ఒక వెంట్రుక పీకేస్తే మరిన్ని వస్తాయా?

ఇప్పట్లో తెల్లజుట్టు చిన్న వయసులోనే వస్తోంది. నిజానికి తెల్లజుట్టు మొదలైన కొత్తలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. వీటిని చూసిన తరువాత చాలామంది చేసే మొదటి పని వాటిని లాగి పారేయడం. ఒకటో రెండో అంతే కదా అవి కనిపిస్తే ఏం బావుంటుందనే కారణంతో ఇలా లాగేస్తారు. అయితే.. ఓ తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయని అపోహపడుతుంటారు. అందులో నిజం లేదు.
READ MORE: India Pakistan Tension: పాక్ ఆర్మీ జనరల్స్, మంత్రులు పారిపోయేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు..
నిజానికి.. జుట్టులో ప్రతి వెంట్రుక మూలానికి మెలనోసైట్స్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తి కణాలు ఉంటాయి. ఈ కణాలు తగ్గడం వల్ల మెలనిన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీని కారణంగా జుట్టు తెల్లగా మారుతుంది. ఒక వెంట్రుకను తీసేయడం దాని చుట్టుపక్కల కుదుళ్ల మీదగానీ, వేరే వెంట్రుకలు తెల్లబడటం మీద ప్రభావం చూపదు. తీవ్రమైన ఒత్తిడి వల్ల జుట్టు చాలా తొందరగా తెల్లబడుతుందనేది కూడా అపోహేనట. కాకపోతే దీర్ఘకాలం ఒత్తిడి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Summer Holidays: వేసవి సెలవుల్లో అనారోగ్యం పాలవ్వకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
అందులో జుట్టు నెరవడం ఒకటి. అయినా, దీనికి శాస్త్రీయమైన రుజువులు మాత్రం లేవంటున్నారు. నెరుపు అనేది జన్యువులు, పరిసరాల కారణంగా తలెత్తే సంక్లిష్టమైన ప్రక్రియ. వీటి తర్వాతే ఒత్తిడి పాత్ర వస్తుంది. వెంట్రుకలను లాగడం వల్ల వెంట్రుకలు ఊడిరావడం, వెంట్రుకలు విరిగిపోవడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తలలో దురద, మంట, నెత్తిమీద దద్దుర్లు వస్తాయట. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుందట.