Leading News Portal in Telugu

Tips to Protect Childrens for Health During Summer Holidays


Summer Holidays: వేసవి సెలవుల్లో అనారోగ్యం పాలవ్వకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

Summer Holidays: ప్రస్తుతం వేసవి కలం కావడంతో స్కూల్స్‌కి సెలవులు రావడం సహజమే. ఈ పరిస్థితులలో పిల్లలు ఇళ్లలోనే గడిపే పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లే సాయంత్రానికి తిరిగి వచ్చే అలవాటులో ఉన్న పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఎక్కువ సమయం ఉంటారు. అయితే వేసవి కాలంలో పిల్లలు వేడి, తేమ, ధూళి, కాలుష్యం వంటి సమస్యల మధ్య వారి ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. మరి వాటి కోసం తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అవేంటో ఒక లుక్ వేద్దామా..

Read also: Heavy Rains : అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

వేసవి వేడి తీవ్రంగా ఉండే ఈ సమయంలో పిల్లలకు చిరాకు పెట్టించే పాపులర్ పాలిస్టర్ బట్టలు కాకుండా, తేలికగా ఉండే కాటన్ దుస్తులను వేయించడం మంచిది. ఇవి శరీరానికి తేమను ఇబ్బంది పెట్టకుండా ఉంచి, చర్మం ఇరుకుగా లేకుండా ఉడికిపోవడాన్ని తగ్గిస్తాయి. ఒకవేళ పిల్లలు బయటకు వెళ్లే అవసరం వస్తే దోమలు, ఇతర కీటకాల నుంచి కాపాడేందుకు లోషన్స్ వాడాలి. ఇది చర్మాన్ని రక్షిస్తూ దద్దుర్లు, తామర వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా వేసవిలో చెమట ఎక్కువగా రావడం వల్ల చర్మ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని నివారించేందుకు సహజమైన నేచురల్ రెమిడీస్, సన్‌స్క్రీన్ లోషన్‌లు, మాయిశ్చరైజర్‌లు ఉపయోగించాలి. ఇవి UV కిరణాల ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి.

సెలవుల్లో పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటారు. ఇంకా క్యార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇది గ్యాస్, కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. వీటిని నివారించేందుకు శుభ్రమైన, ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని అందించడం ద్వారా భయటపడవచ్చు. పిల్లలు బయట ఆడి ఇంటికి వచ్చిన వెంటనే చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. లేకపోతే క్రిములు ఇంట్లోకి చేరి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఆటల్లో మునిగిపోయే పిల్లలు ఎక్కువగా నీరు తాగడం మరిచిపోతారు. దీని వల్ల డీహైడ్రేషన్‌కి లోనవుతారు. కాబట్టి వారిని తరచూ నీరు తాగమని చెప్పాలి. అలాగే పండ్ల రసాలు, నారింజ జ్యూస్ వంటి హైడ్రేటింగ్ పానీయాలు ఇవ్వాలి.

Read also: Pakistani YouTuber: ‘‘వారిని సె*క్స్ బానిసలుగా చేయాలనుకుంటున్నా’’ పాక్ యూట్యూబర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

సెలవుల్లో పిల్లలు స్నాక్స్‌కు అలవాటు పడిపోతారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఇంట్లోనే తయారుచేసి ఇవ్వాలి. వేసవి తాపం తీవ్రమవుతున్న నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో పిల్లలను బయటకు పంపకుండా చూడాలి. అవసరమైతే మాత్రమే, అది కూడా ఉదయం లేదా సాయంత్రం చల్లగా ఉన్న సమయంలోనే బయటకు పంపాలి. సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర UV కిరణాలు, గాలిలో కలిసిన కాలుష్య కారణాలు పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. వీటిని నివారించేందుకు ఇంటిలో శుభ్రత పాటించాలి, అవసరమైతే మాస్కులు వాడించాలి. మొత్తంగా వేసవి సెలవుల్లో పిల్లలు ఆనందంగా గడపడం కంటే ముందు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. పై సూచనలు పాటిస్తూ వారి ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే, పిల్లలు ఈ సెలవులను ఆరోగ్యంగా, సురక్షితంగా గడిపే అవకాశం ఉంటుంది.