
Glowing Skin: ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో కాలుష్యం, చేదు ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల చర్మం అసలైన కాంతిని కోల్పోవడం సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి, సరైన చర్మ సంరక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ముఖం మీద మొటిమల గుర్తులను తగ్గించడంలో, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో అనేక ఇంటి చిట్కాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అందులో పటిక కూడా ఒకటి. ఇది ముఖం మీద అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు మీ ముఖంపై పటికను పూసుకుంటే మొటిమల మచ్చలు బాగా తగ్గుతాయి.
పటికలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పటికలో ఉండే యాంటీ బాక్టీరియల్ అంశాలు చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మొటిమల సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. దీనివల్ల చర్మం శుభ్రంగా కనిపిస్తుంది. పటిక చర్మాన్ని బిగుతుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల ముడతల సమస్య క్రమంగా తగ్గిపోయి చర్మం బిగుతుగా మారుతుంది. దీనితో పాటు, పటిక చర్మం నుండి చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో అలాగే మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీనితో పాటు ఇది చర్మపు రంగును కూడా సరిగ్గా ఉంచుతుంది. పటిక రంధ్రాలను బిగించడంలో, బ్లాక్ హెడ్స్ తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇక మగవారు షేవింగ్ చేసిన తర్వాత లేదా మొటిమల ప్రభావిత ప్రాంతంపై తడి పటికను మెల్లగా రుద్దండి. ఇది మొటిమలు, వాటి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. పటికను నీటిలో కొంత సమయం నానబెట్టి, ఆపై నేరుగా ముఖంపై రుద్దండి. రాత్రి పడుకునే ముందు మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇంకా పటిక నీటితో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఒక కప్పు నీటిలో ఒక చిన్న పటిక ముక్క వేసి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తరువాత, ఈ నీటితో మీ ముఖాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కడుక్కోండి. ఇది మొటిమలు, చర్మ వ్యాధులను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.