
Normal Delivery: నేడు ఎంతో మంది గర్భిణీలు నార్మల్ డెలివరీ కావడం చాలా కష్టంగా మారింది. అయితే, దీనికి వైద్యపరమైన కారణాలు ఉండొచ్చు. అయితే ఈ విషయంలో నార్మల్ డెలివరీకీ మద్దతు ఇచ్చే డాక్టర్‌ను కనుగొనడం చాలా అవసరం. ఒకవేళ డాక్టర్‌కు మీరు ఎంచుకున్న డెలివరీ పద్ధతిపై నమ్మకం లేకపోతే, మీకు పూర్తిగా సహకారం లభించకపోవచ్చు. అందుకే, మొదటి అడుగు ఓ మంచి సపోర్టివ్ డాక్టర్‌ను ఎంచుకోవడం మంచిది. ఇకపోతే, నార్మల్ డెలివరీ కావటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మార్గం సుగమం అవుతుంది.
ఇందులో ముఖ్యంగా, గర్భధారణ సమయంలో శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అధిక బరువు వల్ల డెలివరీ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, లో-ఇంటర్వెన్షన్ ప్రెగ్నెన్సీ అనే విధానాన్ని ఎంచుకోవడం వల్ల అవసరమైన మందులు, పరీక్షలు మాత్రమే చేయించుకోవచ్చు. ఇక నెలలు నిండని సమయంలో నొప్పులు తక్కువగా వస్తుంటాయి. అప్పుడు ఇంట్లోనే ఉండవచ్చు. నెమ్మదిగా తిరగడం, తినడం, తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కానీ, నొప్పులు ఎక్కువగా వచ్చేటప్పుడు హాస్పిటల్‌కి వెళ్లడం మంచిది. ఇది హాస్పిటల్ మీ ఇంటికి సమీపంలో ఉన్నపుడు మాత్రమే సాధ్యపడుతుంది. లేకపోతే ముందే హాస్పిటల్‌కు చేరుకోవాలి.
నాచురల్ డెలివరీ కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధపడటం ఎంతో అవసరం. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోండి. అవసరమైతే చైల్డ్ బర్త్ వీడియోస్ చూసి అవగాహన పెంపొందించండి. ఎంత ప్రణాళిక వేసుకున్నా, చివర్లో నార్మల్ డెలివరీ జరగకపోవచ్చు. కొన్ని సార్లు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఆ సమయంలో మీరు తట్టుకోలేకపోవచ్చు. అప్పుడు సిజేరియన్ డెలివరీ తప్పనిసరిగా మారుతుంది. ఇది పూర్తిగా సాధారణమైంది. అలాంటి సమయంలో గిల్ట్ ఫీలింగ్ అవ్వకూడదు. అలాగే, మీ నాచురల్ డెలివరీ కోసం మద్దతు ఇచ్చే వ్యక్తి మీ పక్కన ఉండడం చాలా ముఖ్యం. ఆ వ్యక్తి మీ తల్లి కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితురాలు కావచ్చు. కానీ, వారికి ఈ ప్రక్రియపై అవగాహన ఉండాలి.