- ఎండాకాలం మొదలైంది
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- అందరిలో హైడ్రేషన్ సమస్య
- కొబ్బరి నీళ్లతో ఎంతో మేలు

ఎండాకాలం మొదలైంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎండాకాలంలో హైడ్రేషన్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు బెస్ట్ ఆప్షన్. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లు సహజంగా తీపిగా, తాజాగా, పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శక్తిని కాపాడటంలో సాయపడతాయి. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీరు అద్భుత ఎంపిక. అసలు కొబ్బరి నీళ్లలో ఏమేమి ఉంటాయో తెలుసా..
READ MORE: Off The Record: పీక్స్‌లో బెజవాడ బ్రదర్స్ వార్..! టీడీపీ డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టిందా..?
ఆకుపచ్చగా ఉండే లేత కొబ్బరి కాయలో ఎక్కువ నీళ్లు ఉంటాయి. పండించే నేలను బట్టి, రకాన్ని బట్టి కొబ్బరి కాయల్లోని నీళ్ల రుచిలో కాస్త మార్పులు ఉంటాయి. ఒక 100 మి.లీ. కొబ్బరి నీటిలో 18 కేలరీలు, 0.2 గ్రాముల ప్రోటీన్, 0 ఫ్యాట్, 4.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4.1 గ్రాముల చక్కెర, 165 మి. గ్రాముల పొటాషియం ఉంటుందట. అలాగే ఎలక్ట్రోలైట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే కొబ్బరి నీరు ఒక అద్భుతమైన పానీయమట. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరంలోని కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు కొబ్బరి నీళ్లలో అనేకం ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.
READ MORE: Off The Record: పెద్దపల్లిలో గులాబీ కేడర్ ను నడిపించే నాయకుడు లేడా..?