Leading News Portal in Telugu

COVID-19 Cases Surge Again in Asia: Singapore, Hong Kong Report Sharp Increases


COVID: కరోనా మళ్ళీ వస్తుందా? సింగపూర్, హాంకాంగ్‌లలో పెరుగుతున్న కేసులు..!

ఆసియాలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ వంటి జనసాంద్రత కలిగిన ఆర్థిక కేంద్రాలలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, బూస్టర్ డోస్‌లు తీసుకునే వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఈ పెరుగుదల సంభవిస్తుందని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. మే 3 నాటికి COVID-19 కేసుల సంఖ్య 14,200 కు చేరుకుంది. ఇది గత వారం కంటే దాదాపు 28% ఎక్కువ.

READ MORE: Asaduddin Owaisi: హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..

ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య కూడా దాదాపు 30% పెరిగింది. అయితే, మహమ్మారి సమయంలో కనుగొనబడిన వేరియంట్‌ల కంటే ఈ వేరియంట్‌లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవానికి.. NB.1.8, LF.7 రకాలు వైరస్‌లు ఇక్కడ వ్యాప్తి చెందుతున్నాయి. ఇవి JN.1 కరోనావైరస్ యొక్క రకాలు. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ ప్రకారం.. కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు భారీ స్థాయికి చేరుకున్నాయి. శ్వాసకోశ నమూనాల పాజిటివిటీ రేటు నాలుగు వారాల క్రితం 6.21% నుంచి 13.66%కి చేరుకుంది. మే మొదటి వారంలో, హాంకాంగ్‌లో కరోనా కారణంగా 31 మంది మరణించారు.

READ MORE: RR vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. మళ్లీ ఓడిన రాజస్థాన్

ఈ అంశంపై భారతీయ వైరాలజిస్టులు, ఆరోగ్య నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన వైరస్ విజృంభణకు అవకాశం లేదని, ఎందుకంటే.. ఇప్పటికే జనాభా కోవిడ్‌ తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. ఈ వ్యాధి మరోసారి మన దేశంలోకి ప్రవేశిస్తే.. సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలతో తేలికపాటి ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చని హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు. ఇప్పటి నుంచే మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, జనసమూహానికి దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు.