Leading News Portal in Telugu

Want to Win a Woman’s Heart? These Qualities Matter More Than Looks


  • అబ్బాయిలకు అమ్మాయిల మనసులను గెలుచుకోవాలని కోరిక
  • కానీ చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అవుతుంటారు
  • ఒక అమ్మాయి హృదయాన్ని గెలవడం అనేది ఒక కళ
  • మగువల మనసు అర్థం చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం
Winning Girls Heart: ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలంటే.. అమ్మాయిలకు పిచ్చి..!

చాలామంది అబ్బాయిలు అమ్మాయిల మనసులను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అవుతుంటారు. నిజానికి ఒక అమ్మాయి హృదయాన్ని గెలవడం అనేది ఒక కళ. సాధారణంగా మగువల మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అమ్మాయిలు కేవలం అబ్బాయిల అందం మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వం, ప్రత్యేక లక్షణాలు, చర్యలు చూసి ఇష్టపడతారు. ఆ లక్షణాలు లేని వారిని వీరు పట్టించుకోరు. కొందరు మగవారు మాత్రం కొన్ని ప్రత్యేక లక్షణాలతో అమ్మాయిల హృదయాలను ఈజీగా కొల్లగొడతారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Makhana: మఖానా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అబ్బాయిలకు తెలివితేటలు ఉండాలని కోరుకుంటారట. తెలివితేటలంటే ఇక్కడ డిగ్రీలు కాదండీ, మేధాశక్తి కీ కాలేజీ డిగ్రీలకీ సంబంధం లేదు. ఎంత తెలివిగా ఆలోచిస్తారు, జీవితం పట్ల ఎంత కుతూహలం ఉంది అన్న దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారట. ఆత్మ విశ్వాసం కూడా ఉండాలని ఎదురు చూస్తారు. ఆత్మ విశ్వాసం తో పాటూ వారి లో ఉన్న బలహీనతలని కూడా పైకి చెప్పుకున్న వారిని ఎక్కువ ఇష్టపడతారట. అందరం తప్పులు చేస్తాం. ఒక్కోసారి తప్పని పరిస్థితే వస్తుంది కూడా. ఆ పరిస్థితులని మీరు అర్థం చేసుకోవాలని స్త్రీలు ఆశిస్తారు. మీరు ఎలాగైతే పర్ఫెక్ట్ కాదో, ఆమె కూడా అంతే కదా. క్షమ లేకుండా ఏ బంధం నిలవదు, వివాహ బంధం అసలే నిలవదు.

READ MORE: CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి గోయల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

స్త్రీ శరీరం లో జరిగే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ని మీరు అర్థం చేసుకుని సహకరించాలని ఆమె కోరుకుంటుంది. పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్.. ఈ టైమ్స్ లో ఆమె హార్మోన్లలో వచ్చే మార్పులని మీరు వేలాకోళం చేయడం వంటివి చేయకూడదని ఆమె భావన. తన పార్ట్నర్ తనని ప్రేమిస్తున్నారు అనే నమ్మకం స్త్రీకి కలగాలి. ఇద్దరి మధ్య ఏ ఆర్గ్యుమెంట్ అయినా స్త్రీకి ఈ నమ్మకం లేకపోవటం వల్లనే వస్తుంది. ఆ నమ్మకం కలిగించవలసిన బాధ్యత పార్ట్నర్ దే. ఆ నమ్మకం ఉన్నప్పుడు స్త్రీ తన పార్ట్నర్ ని ఎంతగానో ఇష్టపడుతుంది.

READ MORE: Air India Express: ఉక్కపోతలో 5 గంటలు నరకం.. చుక్కలు చూపించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం..

ఆమె ఏదైనా చెప్తే వెంటనే నో అనకండి. చాలా మంది ఏ మాత్రం ఆలోచించకుండా భార్య ఏదైనా చెప్పీ చెప్పగానే నో అనేస్తారు. అలాగని చెప్పిన ప్రతిదానికీ యస్ అనమని కూడా చెప్పడం లేదు. ఆటోమేటిక్ గా నో అనకుండా ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆమె చెప్పిన దానిలో ఉన్న పాయింట్ మీకే అర్ధమౌతుంది. మీరు పాజిటివ్ గా రెస్పాండ్ అయితే ఆమెకీ ఆనందమే, మీకూ ఆనందమే. మీరిద్దరూ మాట్లాడుకోవాలంటే మాటలే కరువా? పార్ట్నర్స్ ఏ విషయం గురించైనా గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు. పిల్లలు, పెద్ద వాళ్ళు, ఉద్యోగాలు, సేవింగ్స్, ఫ్రెండ్స్, వాతావరణం… మీ ఇష్టం. రెండు జీవితాలు పెనవేసుకుపోయిన బంధం లో కబుర్లకి సమయం లేదంటే చాలా కష్టం. ఫోన్ చూస్తూనో, టీవీ చూస్తూనో కాక కబుర్ల మీద దృష్టి పెట్టి కబుర్లు చెప్పుకోవాలని ఆమె కోరిక. ప్లీజ్, థాంక్యూ, సారీలు బయట వాళ్ళకి మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళకి కూడా. మీ భార్య, లవర్‌తో ఈ మూడు మాటల్లో కనీసం ఒకటైనా అని ఎంత కాలమయిందో ఒక్కసారి ఆలోచించండి.