- ఈ సీజన్‌లో దొరికే నేరేడు పండ్లతో అనేక లాభాలు
- మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినాలి
- కొలన్ క్యాన్సర్‌ను నిరోధించే శక్తి పెరుగుతుంది

నిగనిగలాడే నేరేడు పండ్లు కొద్దిరోటు మాత్రమే మార్కెట్లో ఉంటాయి. వాటిని తినడం వల్ల 365 రోజులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో చాలా రకాలున్నాయి. కోలగా ఉండ పెద్దగా ఉండే వాటిని అల్ల నేరేడని.. గుండ్రంగా పొట్టిగా ఉంటె చిట్టినేరేడని పిలుస్తారు. నేరేడు పండ్లు భారత్, పాకిస్థాన్, ఇండోనేషియాలలో విరివిగా లభిస్తాయి. ఈ అల్ల నేరేడు పండ్లలో ఉండే ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం.
READ MORE: WTC 2025-27: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ షెడ్యూల్ విడుదల.. భారత్ ఎన్ని మ్యాచులు ఆడనుందంటే..?
అల్లనేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా రుజువైంది. వీటిలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా అల్ల నేరేడు పండ్లు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. మీ గుండె సక్రమంగా పనిచేసేందుకు పొటాషియం సహకరిస్తుంది. అంతేకాకుండా స్ట్రోక్ రాకుండా, హై బ్లడ్ ప్రెషర్ రాకుండా నిరోధిస్తుంది. అలాగే.. విష వాయువులు, వాయు కాలుష్యం కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, శ్వాసనాళాలను శుభ్రం చేసే శక్తి అల్ల నేరేడు పండ్లకు ఉంది. వాయు కాలుష్యం కారణంగా ఎదురయ్యే ఫ్రీరాడికల్స్‌ను ఇవి నియంత్రిస్తాయి. వీటిలో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.
READ MORE: Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం.. కొడుకు పెళ్లి వాయిదా వేసిన ప్రధాని..
అల్ల నేరేడులో ఉండే సైనైడిన్ వంటి సమ్మేళనాలు కొలన్ క్యాన్సర్‌ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి. అల్లనేరేడు పండ్లలో ఉండే యాంటాక్సైడ్లు ఫ్రీరాడికల్స్‌పై పోరాడుతాయి. క్యాన్సర్ కణాలు వృద్ధిని అడ్డుకుంటాయి. అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి దోహదం చేస్తాయి. అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను అల్ల నేరేడు పండ్లు తగ్గిస్తాయి. అల్లనేరేడు పండ్లు తింటే చర్మం మిలమిల మెరుస్తుంది. వీటిలోని యాంటాక్సిడెంట్ల సమ్మేళనాలు, విటమిన్ సీ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అందుకే చర్మం యవ్వనాన్ని సంతరించుకుంటుంది. అల్ల నేరేడు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను ఇవి అడ్డుకుంటాయి. అలాగే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.