
Brest Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అనేక కారకాలు దారి తీస్తాయి. ఇవి జన్యుపరమైనవి, జీవనశైలి సంబంధితవి, హార్మోన్ మార్పులు, ఇంకా పర్యావరణ ప్రభావాల ద్వారా కలుగవచ్చు. మరి ఆ వివిధ కారణాలను వివరంగా ఒకసారి చూద్దాం.
జన్యుపరమైన (జెనెటిక్) కారణాలు:
బ్రెస్ట్ క్యాన్సర్‌కి పూర్వీకుల చరిత్ర ఒక ముఖ్యమైన కారణం. ముఖ్యంగా BRCA1, BRCA2 అనే జన్యుపరమైన మార్పులు ఉన్న మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జన్యుపరమైన సమస్య తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా అందుతాయి.
వయస్సు:
వయస్సు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
హార్మోన్ల ప్రభావం:
అనేక సంవత్సరాలు ఈస్ట్రోజెన్ హార్మోన్‌కి ఎక్కువగా గురికావడం బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాన్ని పెంచుతుంది. ఇది ఆలస్యం గా మెనార్క్ లేదా ఆలస్యంగా మెనోపాజ్ వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
జీవనశైలి:
శరీరానికి వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, అధిక ఆల్కహాల్ సేవించడం, పొగ త్రాగడం వంటివి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. అలాగే జంక్ ఫుడ్, అధిక కొవ్వు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌కి కారణమవుతుంది.
గర్భధారణ సంబంధిత అంశాలు:
చాలా ఆలస్యంగా తొలి గర్భధారణ జరగడం లేదా పిల్లలు లేకపోవడం వంటి పరిస్థితులు కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఓ కారణమవుతాయి. అలాగే, తక్కువ కాలం పిల్లలకు మోతాదుగా పాలివ్వకపోవడం కూడా ఒక ప్రమాదకారి అంశంగా భావించబడుతుంది.
చికిత్సలు:
చాలా సంవత్సరాల క్రితం ఛాతీ భాగానికి ఎక్స్-రే లేదా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
హార్మోన్ థెరపీ:
మెనోపాజ్ తర్వాత హార్మోన్ల సమతుల్యత కోసం కొంతమంది తీసుకునే హార్మోన్ ఔషధాల వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఈ కారణాల వల్ల తప్పకుండా బ్రెస్ట్ క్యాన్సర్‌కి దారితీస్తాయని కాకపోయినా, ఇవి ప్రమాదాన్ని పెంచే అంశాలు. కాబట్టి, ప్రతిఒక్క మహిళా స్వతహాగా ఆరోగ్యపరమైన పరీక్షలు చేయించుకుంటూ, జీవనశైలిని సరిచేసుకుంటే ముందస్తు నివారణ సాధ్యం అవుతుంది.