
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు కాలం కంటే వేగంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, ఆఫీసు, ఆసుపత్రులు ఇలా ఒకటేమిటి వివిధ రకాల బాధ్యతలతో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ఈ ప్రభావం చేసే పనిపై ఎక్కువగా పడుతూ.. మానసిక ఆందోళనకు కారణమవుతోంది. కొన్ని సార్లు ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం, అనుకున్నది పూర్తి చేయలేకపోవడం లాంటి సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫలితంగా ఆందోళన ఇంకా ఎక్కువవుతోంది. మీరు ఈ ఇబ్బందులు, ఒత్తుడులను అధిగమించాలంటే ఈ యోగాసనాలు ట్రై చేయండి..
బాలాసనం: బాలాసనం అనేది మీలో నాడీ (నరాల వ్యవస్థ) వ్యవస్థను ప్రశాంతంగా చేస్తుంది. అలాగే శోషరసం క్రమబద్ధీకరించినట్లు అవుతుంది. ఈ బాలాసనం వల్ల మీ శరీరంలో ఒత్తిడి తగ్గి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది.
ప్రాణాయామం: ఊపిరి ఎలా పీల్చాలో, బాడీకి ఆక్సిజన్‌ను ఎలా ఎక్కువగా పంపాలో… ప్రాణాయామం ద్వారా తెలుస్తుంది. దీని వల్ల రక్త నాళాల్లో ఆక్సిజన్ పెరుగుతుంది. ఇది ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది. ఒత్తిడి, టెన్షన్, ఆత్రుత వంటివి తగ్గుతాయి. తగ్గుతుంది. మానసికంగా ఫిట్ అవుతారు.
ఒంటె ఆసనం : ఒంటె ఆసనం వేసినప్పుడు మీలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఒక్కసారిగా శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. బాడీకి, బ్రెయిన్‌కీ ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంది. మీ మనసు, శరీరం ప్రశాంతంగా అయిపోతాయి.
బంధాసనం: బ్రిడ్జీ పోజ్.. దీన్నే సేతు బంధాసనం అని కూడా అంటారు. ఈ ఆసనం మీ శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. ఇది మీలో ఆతృత, టెన్షన్, మదనపడేతత్వాన్ని తగ్గిస్తుంది. కాళ్లు, వెనక భాగం మరింత చక్కగా సాగుతాయి. తద్వారా మీకు నిద్ర బాగా పడుతుంది.