
ప్రపంచవ్యాప్తంగా జపాన్ మహిళలు తమ సహజ సౌందర్యంతో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా వారి మేనిఛాయ తళతళ లాడేలా ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, వారు ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను వాడకుండానే ఈ అందాన్ని కాపాడుకుంటున్నారు. వంటింట్లో దొరికే సాదా పదార్థాలతోనే చర్మానికి మేజిక్ చేస్తున్నారు. వీరిది ప్రత్యేకమైన ‘4-2-4 స్కిన్ కేర్ టెక్నిక్’. ఇది ముఖం శుభ్రతకు, ఆరోగ్యానికి విస్తృత ప్రయోజనాలు అందిస్తుంది.
1. 4 నిమిషాల ఆయిల్ మసాజ్
ముందుగా ఆయిల్ బేస్డ్ క్లెన్సర్‌ను తీసుకుని ముఖంపై మృదువుగా నాలుగు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇది మేకప్, ధూళి, నూనె, మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. ముఖంపై రక్త ప్రసరణను పెంచి చర్మానికి జీవం చేకూరుస్తుంది.
2. 2 నిమిషాల క్లెన్సింగ్ మసాజ్
తరువాత, వాటర్ బేస్డ్ క్లెన్సర్‌ను ఉపయోగించి ముఖంపై మరో రెండు నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయాలి. ఇది మృతకణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా, తాజాగా మారుస్తుంది.
3. 4 నిమిషాల క్లీన్ వాష్
ఇప్పుడు ముఖాన్ని రెండు నిమిషాల పాటు గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇది నూనె జాడలను తొలగిస్తుంది. తర్వాత మరో రెండు నిమిషాల పాటు చల్లటి నీటితో ముఖం కడగాలి. దీని వల్ల చర్మ రంధ్రాలు కుదించబడతాయి, చర్మం బిగుతుగా మారుతుంది.
ఈ విధానం వల్ల లాభాలేంటి?
– చర్మం హైడ్రేట్‌గా మారి కాంతిమంతంగా కనిపిస్తుంది
– మృత కణాలు తగ్గిపోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది
– రక్త ప్రసరణ మెరుగవడం వల్ల మొటిమలు తగ్గుతాయి
– వేడి–చల్లటి నీటి వాడకం వల్ల తేమ నిలుపుదల చక్కగా జరుగుతుంది
– రోజువారీగా చేస్తే చర్మం ఆరోగ్యంగా, యౌవనం గా మారుతుంది
తేలికగా పాటించదగిన అందాల సీక్రెట్
ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేకుండా, జపాన్ మహిళల అందం వెనకున్న ఈ సరళమైన స్కిన్‌కేర్ పద్ధతిని మీరు కూడా దినచర్యగా మార్చుకోండి. రోజుకు పది నిమిషాలే సరిపోతాయి.. కానీ ఫలితాలు మాత్రం ప్రత్యేకమే.