- మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషకాలు
- వాటిల్లో శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు
- అలా మనకు లభించే కీరదోసలో అనేక ప్రయోజనాలు
- ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధం

మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి.
READ MORE: Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఎక్స్ట్రా ఫోకస్?
ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు కీరా తినాలని సూచిస్తున్నారు. కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి.. మూత్ర సమస్యలు తగ్గుతాయి. కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహకరిస్తాయి.
READ MORE:Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేంద్ర మంత్రికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైన సిట్
కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది. కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల దప్పిక కాకుండా ఉంటుంది. కీరదోసను చక్రాలుగా తరిగి కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్ల మంటలు, ఎరుపులు తగ్గి, కళ్లు కాంతివంతంగా ఉంటాయి.