Leading News Portal in Telugu

Raw Garlic on Empty Stomach: Natural Remedy for Bone, Heart & Gut Health


Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్‌తో పని లేదు !

ప్రతి ఇంటి వంటగదిలో సహజంగా దొరికే పచ్చి వెల్లుల్లి లో ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత శక్తి దాగి ఉంది. ఆయుర్వేదంలోనే కాకుండా ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, పేగుల శుద్ధికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎముకల వ్యాధికి చెక్ :
ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బను ముక్కలుగా కోసుకుని తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. కండరాల ఎదుగుదలకు కూడా ఇది తోడ్పడుతుంది. బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరోసిస్) రాకుండా ఉండేందుకు సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిని తినిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందని సూచన.

గుండె ఆరోగ్యానికి ప్రాణం లాంటి దివ్యౌషధం :
పచ్చి వెల్లుల్లి లో ఉండే ఆలిసిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతుంది. దీనివల్ల రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉంటుంది. ఇలా గుండెపై వచ్చే వత్తిడిని తగ్గించి, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. గుండెకు ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ నిలుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుందనే అభిప్రాయమూ ఉంది.

పేగుల శుద్ధి – రోగనిరోధక శక్తికి బలమైన మద్దతు :
వెల్లుల్లిలోని సహజ యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. ఇది జీర్ణక్రియకు సహకరించే పోషకాలను అందించడంతో పాటు, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరం పటిష్టంగా మారుతుంది.

గమనిక:
ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా అందించబడింది. ఆరోగ్య సంబంధ సమస్యల నివారణ కోసం తప్పనిసరిగా ఆయుర్వేద లేదా అలోపతీ వైద్య నిపుణుని సంప్రదించడం ఉత్తమం.