- బరువు తగ్గేందుకు సులభమైన మార్గాల కోసం అన్వేషణ
- మందును పరిచయం చేసిన డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ
- ఈ ఔషధం పేరు వెగోవీ (సెమాగ్లుటైడ్).. పూర్తి వివరాలు ఇవే

చాలా మంది బరువు తగ్గడానికి సులభమైన మార్గాల కోసం వెతుకుతారు. అందుకే.. వివిధ కంపెనీలు సప్లిమెంట్లు, కొవ్వు తగ్గించే మాత్రలు, పౌడర్లు, ఇంజెక్షన్లు వంటి ఉత్పత్తులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉంటాయి. చాలా మంది ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు. అలాంటిదే మరో ఇంజెక్షన్ భారత్‌లో విడుదలైంది. జూన్ 24న, డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ బరువు తగ్గించే మందును విడుదల చేసింది. ఈ ఔషధం పేరు వెగోవీ (సెమాగ్లుటైడ్). ఇది ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. వెగోవీ అనేది వారానికి ఒకసారి తీసుకుంటే ఊబకాయం, అధిక బరువు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుందని కంపెనీ తెలిపింది.
READ MORE: Dr K Laxman: తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే రాష్ట్రపతికి బీసీ బిల్ పంపారు..
భారత్‌లో మోంజారో తర్వాత, వెగోవి మాత్రమే అధికారికంగా ప్రారంభించారు. కానీ.. ఇతర దేశాలలో ఓజెంపిక్, మోంజారో, వెగోవి వంటి చాలా రకాల మందులను అధికారికంగా ఉపయోగిస్తున్నారు. వెగోవి ఎలా పని చేస్తుంది? దీని ధర ఎంత? అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఫార్మాట్రాక్ ప్రకారం.. భారత్‌తో దాదాపు 25.4 కోట్ల మంది సాధారణ ఊబకాయంతో బాధపడుతున్నారు. 35.1 కోట్లకు పైగా ప్రజలు బెల్లీ ఫ్యాట్‌కు సంబంధించిన సమస్యలతో పోరాడుతున్నారు. 2021లో, ఊబకాయాన్ని తగ్గించే మందుల మార్కెట్ దాదాపు రూ.133 కోట్లుగా ఉండగా, ఇప్పుడు అది రూ.576 కోట్లకు పెరిగింది.
READ MORE: Vijay Anthony : తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పెరిగింది.. హీరో విజయ్ కామెంట్స్..
వెగోవీ అనేది వారానికి ఒకసారి వేసే ఇంజెక్షన్. ఇది ఫ్లెక్స్‌టచ్ అనే పెన్ను లాంటి పరికరంలో వస్తుంది. దీనిని ఉపయోగించడం చాలా సులభం. దీనికి వయల్స్ లేదా సిరంజిలు అవసరం లేదు. ఈ ఇంజెక్షన్ ఆకలి, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. అంటే.. మీరు తక్కువగా తిన్నా.. కడుపు నిండుతుంది. దీంతో ఇది తీసుకున్న వాళ్లు తక్కువ తింటారు. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తూ కొవ్వును సులభంగా కరిగిస్తుంది. ఈ మందు ఈ 5 మోతాదుల్లో వస్తుంది. 0.25 mg, 0.5 mg, 1 mg, 1.7 mg, 2.4 mg లలో లభ్యమవుతుంది. రోగుల పరిస్థితిని బట్టి పలు ఏ మోతాదులో తీసుకోవాలో వైద్యులు సూచిస్తారు. దీని ధర కింది పట్టికలో పొందుపరిచాం..
గమనిక: ఈ ఔషధం డాక్టర్ సూచనలతో మాత్రమే తీసుకోవాలి.. వైద్య నిపుణుల సలహా లేకుండా దీనిని ఉపయోగించవద్దు.