- వర్షాకాలంలో అంటు వ్యాధుల ప్రమాదం
- దోమలు విజృంభణ వల్ల అనేక వ్యాధులు
- ఈ చిట్కాలు పాటించడం వల్ల ఉపశమనం

వర్షాకాలంలో అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. దోమలు విజృంభించడం వల్ల అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలు వర్షాకాలంలోనే మొదలవుతాయి. ఈ సీజన్‌లో స్కిన్ అలర్జీలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు సర్వసాధారణం. ఉష్ణోగ్రత, గాలి నాణ్యత, ధూళి, తేమ కారణంగా వర్షాకాలంలో మెడ, మోచేతులు, చేతులు, రొమ్ము కింద, గజ్జ చర్మం మొదలైన ప్రాంతాల్లో చెమట ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా, బ్యాక్టీరియా, వైరస్లు పుడతాయి. ఇది అలెర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంటర్‌ట్రిగో, రింగ్‌వార్మ్, తామర, చర్మపు దద్దుర్లు, గొంతు నొప్పి, తామర, జలుబు, జ్వరం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలను పెంచుతుంది.
READ MORE: Matrimonial Fraud: రెండో పెళ్లి కోసం చూస్తే.. భరణంగా వచ్చిన రూ. 3.6 కోట్లు కొల్లగొట్టిన మోసగాడు..
వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల చర్మంపై అలర్జీలు, హైపర్‌పిగ్మెంటేషన్, జిడ్డుదనం-మొటిమలు.. వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. ఇంటి పనుల రీత్యా చేతులు, కాళ్లు ఎక్కువ సేపు నీటిలో నానడం వల్ల కూడా ఆయా భాగాల్లో చర్మంపై పగుళ్లు, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తాయి. అందుకే ఈ కాలంలో మన చర్మాన్ని ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇంటి పనులు చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం, బయటికి వెళ్లేటప్పుడు రెయిన్‌షూస్ వేసుకోవడం వల్ల చేతులు, కాళ్లను సంరక్షించుకోవచ్చు. అలాగే చర్మ ఆరోగ్యానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఇక ఎండ ఉన్నా, లేకపోయినా మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది. ఇక వీటన్నింటితో పాటు సౌందర్య నిపుణుల సలహా మేరకు ఇంట్లోనే చిన్న చిన్న బ్యూటీ చిట్కాలు పాటిస్తే అందంగా, ఆరోగ్యంగా మెరిసిపోవచ్చు.