
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత లేకపోతే బద్ధకం, అలసట, తలనొప్పి వంటి అనేక సమస్యలు కలుగుతాయి. ప్రస్తుతం జీవనశైలిలో చేడు ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. కావున రాత్రిపూట సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నవారు క్రింద పేర్కొన్న విషయాలపై ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
READ MORE: Off The Record: రగిలిపోతున్న ఆ సీనియర్స్ ఎవరు.. వాళ్లకు జరిగిన అవమానం ఏంటి.?
టీకి దూరంగా ఉండండి..
మామూలుగా టీ అంటే ఇష్టపడని వారుండరు. కొందరు టైంతో పనిలేకుండా రెండు మూడు గంటలకు ఒకసారి టీని తాగుతూ ఉంటారు. పడుకునే ముందు ఒక్క కప్పు వెచ్చని బ్లాక్ టీ తాగితే.. రాత్రంతా మేల్కోని ఉండేలా చేస్తుంది. దీనిలో ఉండే కెఫిన్ మంచి సువాసనను వెదజల్లుతుంది. అయితే.. పాలు కలపకుండా చేసే టీ తాగడం వల్ల మెదడు మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. దీని ప్రభావం మెదడు పై చురుగ్గా పనిచేస్తుంది. అందుకే చాలామంది రాత్రి పూట బ్లాక్ టీని దూరం పెడతారు.
READ MORE: PM Modi: జూలై 2 నుంచి 9 వరకు ప్రధాని మోడీ 5 దేశాల పర్యటన..
డార్క్ చాక్లెట్ ప్రభావం..
డార్క్ చాక్లెట్ ఇది కూడా నిద్ర పై ప్రభావం చూపుతుంది. దీనిలో కూడా కెఫిన్ ఉంటుంది. రుచిగా ఉండే ఈ డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల ఎంత మత్తులో ఉన్నా సరే నిద్ర దూరం అవుతుంది. అర్థరాత్రి సమయంలో ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే డార్క్ చాక్లెట్ తినొచ్చు.
READ MORE: PM Modi: జూలై 2 నుంచి 9 వరకు ప్రధాని మోడీ 5 దేశాల పర్యటన..
కాఫీ వద్దే వద్దు..
సాధారణంగా కాఫీ అలవాటు అందరికి ఉంటుంది. అయితే రాత్రి సమయంలో వెచ్చని కప్పు కాఫీని తాగితే నిద్ర ఎగిరిపోతుంది. కాఫీ తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్.. మెదడులోని నిద్రను ప్రోత్సహించే గ్రాహకాలను నిరోధిస్తుంది. అందువల్ల మెదడు అప్రమత్తంగా ఉండి.. మగతను దూరం చేస్తుంది. అందువల్ల రాత్రి సమయంలో కాఫీకి దూరంగా ఉంటే మంచిది.
డెజర్ట్ కేక్ తినడం మానేయండి..
ఈ చిరుతిండి రాత్రి నిద్రను చెడగొడుతుంది. మామూలుగా దీన్ని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ స్వీట్ డెజర్ట్ ను అర్థరాత్రి సమయంలో చూస్తే తినకుండా ఉండలేరు. దీనిని తినేటప్పుడు కాఫీ ఫ్లేవర్ తో తయారు చేసిన ఈ స్నాక్ కెఫిన్ ఫీల్ పాటు క్రంచీగా అనుభూతిని కలిగిస్తుంది. కాని రాత్రి పూట దీన్ని తినడం వల్ల అస్సలు నిద్ర పట్టదు.
గ్రీన్ చిల్లీతో నిద్రకు భంగం
గ్రీన్ చిల్లీ ఇందులో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను మార్చేస్తుంది. తాత్కాలికంగా వేడిగా అనిపించేలా చేస్తుంది. వేడి యొక్క విస్ఫోటనం ఒక గంట పాటు నిద్ర రాకుండా ఉండటానికి తగినంత శక్తిని ఇస్తుంది. అయితే మరీ ఎక్కువగా తింటే కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది.
READ MORE: Kubera vs Kannappa : కుబేరపై కన్నప్ప ఎఫెక్ట్ పడుతుందా..?