Leading News Portal in Telugu

Do you use a pressure cooker to cook these foods?


Health Tips: ఈ ఫుడ్స్ వండేందుకు ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా? అయితే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!

ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాక వంటింటి పనులు ఈజీ అయిపోయాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో సమయాన్ని ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ప్రెషర్ కుక్కర్లు, మిక్సీలు వంటి పరికరాలను వాడుతున్నారు. వీటిల్లో ప్రెషర్ కుక్కర్ ను పలు రకాల ఆహార పదార్థాలను వండేందుకు యూజ్ చేస్తుంటారు. అయితే ప్రెషర్ కుక్కర్ లో ఈ ఆహారాలను వండుకుని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. మరి ప్రెషర్ కుక్కర్ లో వండకూడని ఆహార పదార్ధాలు ఏవో తెలుసుకుందాం.

రైస్: అన్నం వండేందుకు ప్రెషర్ కుక్కర్లను వినియోగిస్తుంటారు. త్వరగా ఉడుకుతుందని అన్నాన్ని దీనిలోనే వండుతారు. కానీ ఇలా వండడం వలన స్టార్చ్ అక్రిలమైడ్ అనే రసాయనం విడుదల అవుతుందట. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదంకరం అంటున్నారు నిపుణులు.

బంగాళదుంపలు: వీటిని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించి తినడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఇలా ఉడికించిన బంగాళదుంపలలో ఎక్కువ మొత్తంలో యాంటీ న్యూట్రీషియన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి శరీరానికి సరైన పోషకాలను అందించలేవు.

కూరగాయలు: కూరగాయలని కూడా ప్రెషర్ కుక్కర్ లో ఉడకపెట్టకూడదంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే అందులో ఉండే పోషకాలు నశిస్తాయంటున్నారు.

బచ్చల కూర: బచ్చల కూరను ప్రెషర్ కుక్కర్ లో ఉడికించడం వలన.. అందులో ఉండే ఆక్సలేట్‌ లు మరింత కరిగిపోతాయి. దాని కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే దీనిని వండేటప్పుడు ఎక్కువ నీరు, తక్కువ ఉష్ణోగ్రత ఉంటె సరైన పోషకాలు శరీరానికి అందుతాయి.

చేపలు: వీటిని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించడం వలన వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పోతాయి. కాబట్టి అప్పుడు వీటిని తిన్నా కూడా అంత ప్రయోజనం ఏమి ఉండదు. అందుకే ప్రెషర్ కుక్కర్ లో ఉడికించి తినడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.