EBM News Telugu

Motorola Edge+ స్మార్ట్‌ఫోన్ లాంచ్… డిస్కౌంట్ ఆఫర్లతో ప్రీ-బుకింగ్

0

మోటరోలా యొక్క 2020 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ + ఈ రోజు ఇండియాలో అధికారికంగా విడుదల అయింది. లెనోవా యాజమాన్యంలోని మోటరోలా సంస్థ మోటరోలా ఎడ్జ్ మరియు ఎడ్జ్ + అనే ఈ రెండు సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను గత నెలలో విడుదల చేసింది. ఇందులో మోటరోలా ఎడ్జ్ + ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్టాండర్డ్ ఫీచర్స్ అయిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865, 108-మెగాపిక్సెల్ కెమెరా, OLED డిస్ప్లే మరియు 5G లతో వస్తుంది. 2020 లో టాప్-ఆఫ్-ది-లైన్ ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇండియా ధర, లభ్యత మరియు ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ధరల వివరాలు
మోటరోలా ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ తో మాత్రమే లభించే ఈ హ్యాండ్‌సెట్ యొక్క ధర రూ.74,999 గా ఉంది. ఇది ఈ రోజు అంటే మే 19 నుండి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రీ-ఆర్డర్స్ చేయడానికి కొనుగోలుదారులకు అవకాసం ఇస్తున్నది. వీటి మొదటి సేల్స్ మే 26 నుంచి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో మొదలుకానున్నాయి.

మోటరోలా ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ స్మోకీ సాంగ్రియా మరియు థండర్ గ్రే వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మొదలుకానున్న ముందస్తు బుకింగ్ ల మీద అద్భుతమైన లాంచ్ ఆఫర్లను అందిస్తున్నది. ఐసిఐసిఐ బ్యాంక్‌ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల వినియోగదారులకు రూ.7,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించడం కోసం ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు క్యాష్ బ్యాక్‌తో పాటు నో-కాస్ట్ ఇఎంఐ లావాదేవీలను కూడా అదనంగా అందిస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.