Leading News Portal in Telugu

Arif And Eagle Friendship: మళ్ళీ డేగతో స్నేహం చేస్తున్న ఆరిఫ్.. చిక్కులు తప్పవా అంటున్న నెటిజన్లు.. – Telugu News | Arif reared an eagle after friendship with saras in amethi in Uttar Pradesh


ఆరిఫ్ డేగల స్నేహంతో మరోసారి ఇబ్బందుల్లో పడవచ్చని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదే విషయంపై అమేథీ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) డీఎన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. తమకు ఆరిఫ్‌ డేగ గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఈ పనిని మీరు సమర్థిస్తారా అని ప్రశ్నించగా, దీనికి సంబంధించిన నిబంధనలను తాను ఇంకా చూడలేదని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన ఆరిఫ్, సరస్ మధ్య స్నేహం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఈసారి డేగతో స్నేహం చేసి మళ్ళీ ఆరిఫ్ వెలుగులోకి వచ్చాడు. అమేథీలోని జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని మండ్కాకు చెందిన ఆరిఫ్.. తనదగ్గరకు డేగ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాడు. ఆరీఫ్ మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ జిల్లా నసీరాబాద్‌లో వాహనం ఢీ కొని డేగ పక్షికి గాయమైందని ఎవరో చెప్పారు.

దీంతో గాయపడిన స్థితిలో ఉన్న డేగను రాయ్ బరేలీలోని నసీరాబాద్ నుండి తన దగ్గరకు తీసుకుని వచ్చాడు ఆరిఫ్. అప్పుడు దానికి చికిత్స చేయించాడు. గాయం తగ్గిన తర్వాత డేగను వదిలేసినట్లు ఆరిఫ్ చెప్పాడు. అయితే స్వేచ్ఛగా ఎగిరిపోయిన డేగ మళ్ళీ మళ్లీ తనంతట తానుగా తన దగ్గరకు వచ్చినట్లు చెప్పాడు.  అప్పటి నుంచి ఆరిఫ్ ను వదిలి ఆ డేగ ఎక్కడికీ వెళ్లడం లేదు. ఈ డేగ ఇంట్లోని ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఉంది. ఇప్పుడు ఆరిఫ్‌, డేగల స్నేహం ఏరియాలో చర్చనీయాంశమైంది.

డేగతో ఆరిఫ్ స్నేహం

ఇవి కూడా చదవండి

అయితే ఆరిఫ్ డేగల స్నేహంతో మరోసారి ఇబ్బందుల్లో పడవచ్చని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదే విషయంపై అమేథీ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) డీఎన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. తమకు ఆరిఫ్‌ డేగ గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఈ పనిని మీరు సమర్థిస్తారా అని ప్రశ్నించగా, దీనికి సంబంధించిన నిబంధనలను తాను ఇంకా చూడలేదని అన్నారు. పరిశీలించి తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామని .. ఆరిఫ్ చేస్తున్న పని.. అతనికి పక్షి ప్రేమ అనిపించడం లేదని చెప్పారు.

కొంగ స్నేహంతో వెలుగులోకి వచ్చిన ఆరిఫ్ 

దాదాపు ఆరు నెలల క్రితం, ఆరిఫ్ , సరస్ పక్షి మధ్య స్నేహం వీడియో వైరల్ అయ్యింది. దీని తర్వాత యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఆరిఫ్ ఇంటికి చేరుకున్నారు. సరస్, ఆరిఫ్‌ల స్నేహబంధాన్ని ఆయన కొనియాడారు. అదే సమయంలో సరస్‌కు సంబంధించి రాష్ట్రంలో పలు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో చర్యలు తీసుకుని పరిపాలన యంత్రాంగం కొంగ పక్షిని తమ అదుపులోకి తీసుకుని కాన్పూర్ జంతు ప్రదర్శనశాలకు పంపింది. అనంతరం ఆరిఫ్ కూడా కొంగను కలవడానికి జూకు వెళ్లాడు. అక్కడ కొంగ అతన్ని చూడగానే చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..