Viral Video: బామ్మా మజాకా.. బ్యాట్ పట్టి సెంచరీ కొడతానంటూ.. వైరల్ అవుతున్న వీడియో. – Telugu News | Grandma playing cricket at the age of 96 video goes Trending Telugu Viral Video
అయితే ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటిస్తుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ ఈమె ఆహారపు అలవాట్లు. ఈమెకు పిల్లలు లేరు. 40 ఏళ్ళ క్రితమే ఈమె భర్త చనిపోయాడు. చిన్నప్పటి నుంచి పెంచిన ఇద్దరు మేనళ్లుళ్ల వద్ద ఉంటుంది. ఆ గ్రామం లో అత్యంత పెద్ద వయసు కలిగిన వ్యక్తి ఈమే. ఇప్పటికి ఆ కుటుంబంలో నాలుగు తరాల వారిని చూసింది.
మనవలు, మనరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో బ్యాట్ పట్టి క్రికెట్ ఆడతానంటోంది ఓ 96 ఏళ్ల బామ్మ. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం, అడవికొలను గ్రామానికి చెందిన దొంగ సుబ్బమ్మ అనే ఈ బామ్మ వీధిలో ఆడుకుంటున్న కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతోంది. ఆ పిల్లలు కూడా బామ్మఉత్సాహం చూసి ఎంతగానో ప్రోత్సహించారు. అంతే బామ్మ ఇక చూస్కో నా సామిరంగా అంటూ బ్యాట్ పట్టి బౌండరీలు బాదింది. 96 ఏళ్ళ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్న ఈ బామ్మ రోజూ వాకింగ్ చేస్తుంది. ఏనాడూ కళ్లద్దాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. ఎంతో హుషారుగా తిరుగుతూ పిల్లలతో ఆటలాడుకుంటుంది. ఈరోజు ల్లో వయసుతో సంబంధం లేకుండా వచ్చే షుగర్, బీపీ వంటి సమస్యలు అసలే లేవు. అందరిలాగే అన్ని ఆహార పదార్దాలు తింటుంది. అయితే ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటిస్తుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ ఈమె ఆహారపు అలవాట్లు. ఈమెకు పిల్లలు లేరు. 40 ఏళ్ళ క్రితమే ఈమె భర్త చనిపోయాడు. చిన్నప్పటి నుంచి పెంచిన ఇద్దరు మేనళ్లుళ్ల వద్ద ఉంటుంది. ఆ గ్రామం లో అత్యంత పెద్ద వయసు కలిగిన వ్యక్తి ఈమే. ఇప్పటికి ఆ కుటుంబంలో నాలుగు తరాల వారిని చూసింది. ప్రతి రోజు ఆమె ఉంటున్న వీధిలో అటూ ఇటూ నాలుగు కిలోమీటర్లు నడుస్తుంది. ఈమె ఆరోగ్యం పై స్థానిక ప్రజలు ప్రతిరోజూ చర్చించుకుంటూనే ఉంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్…