Female Voice: వీడి తెలివి తెల్లారిపోను.. ఆడవారి గొంతుతో మాట్లాడి 41 లక్షలు కాజేశాడు.. ఏం జరిగిందంటే – Telugu News | A young man collects 41 lakh Rupees by speaking with a female voice in bengaluru
కళాశాల చదువు పూర్తి చేసుకని మంచి ఉద్యోగం చేయాలని అతడు కలలు కన్నాడు. చివరికీ ఉద్యోగంలోకి చేరా జీతం సరిపోకపోవడంతో విలాసవంతమైన జీవితం కోసం అడ్డ దార్లు తొక్కాడు. అతడు వేసిన స్కేచ్‌ను చూస్తే ఆశ్యర్యపోకుండా ఎవరూ ఉండలేరు. అతడు చేసిన చేష్టలకి పోలీసులు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా పెరిగాక ఆన్‌లైన్‌లో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్ లాంటి యాప్స్‌లో పరిచయలు పెంచుకోవడం డబ్బలు పంపించమని అడగడం ఆ తర్వాత సొమ్మును తీసుకోని గుడ్ బాయ్ చెప్పడం లాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ యువకుడు వేసిన ప్లాన్‌ని చూస్తే ఆశ్చర్యపోకుండా ఎవరూ ఉండలేరు.కళాశాల చదువు పూర్తి చేసుకని మంచి ఉద్యోగం చేయాలని అతడు కలలు కన్నాడు. చివరికీ ఉద్యోగంలోకి చేరా జీతం సరిపోకపోవడంతో విలాసవంతమైన జీవితం కోసం అడ్డ దార్లు తొక్కాడు. అతడు వేసిన స్కేచ్‌ను చూస్తే ఆశ్యర్యపోకుండా ఎవరూ ఉండలేరు. అతడు చేసిన చేష్టలకి పోలీసులు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని కుణిగల్ తాలుకాలోని కగ్గేరి ప్రాంతంలో రవి కుమార్ అనే వ్యక్తి (23) నివాసం ఉంటున్నారు.
అతడి కాలేజ్ పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఐటీ హబ్‌కు వచ్చేశాడు. బెంగళూరులోని కొంతకాల పాటు నివాసం ఉన్నాడు. ఆ తర్వాత బెంగళూరు శివారుకు తన మకాం మార్చేశాడు రవి కుమార్. అయితే ఇతడికి కంపెనీలో ఇస్తున్న జీతం సరిపోలేదు. డబ్బలు సంపాదించడం కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. దీంతో చివరికి సోషల్ మీడియాలో మగవారు ఆడవాళ్ల గొంతుతో మాట్లాడటం ఎలా అని చూశాడు. ఈ క్రమంలోనే మగవాళ్లు ఆడవారి గొంతుతో మాట్లాడేలా శిక్షణ ఇస్తామని బెంగళూరుకి చెందిన ఓ సంస్థ ప్రకటన చేసింది. ఇంకేముంది రవి కుమార్ అందులో చేరి శిక్షణ తీసుకున్నాడు. అందులో ప్రావీణ్యం సంపాదించుకున్న అతడు అచ్చం ఆడవారి గొంతుతో మాట్లాడటం అలవాటు చేసుకోని పెద్ద స్కెచ్ వేశాడు. ముందుగా ఓ వ్యక్తికి కాల్ చేసి ఆడవారి గొంతుతే మాట్లాడి మెల్లగా ముగ్గులోకి దింపాడు. తన ప్రావీణ్యంతో రోమాంటిగ్‌గా మాట్లాడటం, జోక్స్ వేయడం మొదలుపెట్టాడు.
ఇలా అతడ్ని వలలో వేసుకున్న రవికుమార్ తన అసలు ప్లాన్ ప్రారంభించాడు. మా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయని.. మా అమ్మకు ఆరోగ్య బాగాలేదని.. ఆసుపత్రిలో చికిత్స చేయాలని అవతలి వ్యక్తిని నమ్మించాడు. దీంతో అప్పుడప్పుడు డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తికి ఫోన్ చేసి అతడి నగ్న ఫోటోలు, వీడియోలు సంపాదించాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. ఇలా ఆ వ్యక్తి నుంచి రవికుమార్ ఏకంగా 41 లక్షల రూపాయలు సంపాదించాడు. అయినా కూడా రవి ఆ వ్యక్తిని ఇంకా డబ్బులు అడిగాడు. దీంతో చివరకి ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. రవి ఇంకా ఎంతమందిని మోసం చేస్తున్నాడో అని ఆరా తీస్తున్నారు. మారుతున్న సాంకేతికతో ఫోన్లో మాట్లాడేది మగవారా లేక ఆడవారా అని తెలియక వారి మాయమాటలు నమ్మి అమాయకులు బలవుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..