Leading News Portal in Telugu

My India My Life Goals: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండండి.. భావితరాలను కాపాడండి.. – Telugu News | My India My Life Goals to save environment and for healthy living, to do minimum usage of single use plastic


My India My Life Goals: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం.. ‘‘మై ఇండియా – మై లైఫ్‌ గోల్స్‌ పేరుతో.. లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూవ్‌మెంట్‌’’ నినాదంతో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమంలో టీవీ9 నెట్‌వర్క్ కూడా భాగస్వామ్యమై.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోంది.

My India My Life Goals: భావితరాలు బాగుండాలంటే పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం.. ‘‘మై ఇండియా – మై లైఫ్‌ గోల్స్‌ పేరుతో.. లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూవ్‌మెంట్‌’’ నినాదంతో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమంలో టీవీ9 నెట్‌వర్క్ కూడా భాగస్వామ్యమై.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోంది. దీనికోసం టీవీ9 నెట్‌వర్క్ ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా ‘సే నో టు ప్లాస్టిక్’ అంటూ ప్రచారాన్ని ప్రారంభించింది. ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వన్యప్రాణులకు, పర్యావరణానికి పెను ముప్పు తెచ్చిపెడుతోంది. అంతే కాకుండా, ఇది విషపూరిత రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తోంది. కావున ప్లాస్టిక్ ను వాడకుండా పర్యావరణం కోసం మీరూ కృషిచేయండి.. ఇప్పటినుంచి మీరూ అనండి.. సే నో టు ప్లాస్టిక్..

మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..