Leading News Portal in Telugu

PM Modi Speech Live: విపక్షాల కౌంటర్లకు స్ట్రాంగ్ రిప్లై.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే.. లైవ్ వీడియో – Telugu News | PM Modi Speech Live Video on No Confidence Motion In Parliament Lok Sabha


PM Modi Speech Live: అవిశ్వాస తీర్మానంలో భాగంగా మూడో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభలో సమాధానం ఇవ్వనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మణిపూర్ విషయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఎలా సమాధానం ఇవ్వనున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.

PM Modi Speech Live: మణిపూర్ హింసకు వ్యతిరేకంగా లోక సభలో విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మూడో రోజు వాడీవేడిగా కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా అధికారపక్షం వర్సెస్.. విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంలో భాగంగా మూడో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభలో సమాధానం ఇవ్వనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మణిపూర్ విషయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఎలా సమాధానం ఇవ్వనున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. రెండు రోజులుగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు.. ప్రభుత్వం ఇస్తున్న కౌంటర్లతో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాహుల్ గాంధీ ప్రసంగం అనంతరం.. స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్ తోపాటు విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే.. ప్రధాని మోడీ లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్నారు.. లైవ్ లో చూడండి..