PM Modi: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం.. మణిపూర్ అంశంపై స్పందించిన ప్రధాని.. విపక్ష కూటమికి చురకలు – Telugu News | Prime Minister Modi Counters to Opposition Parties in No Confidence Motion Debate
పార్లమెంట్‌లో విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మూడు రోజుల పాటు సుధీర్ఘంగా సాగిన చర్చల అనంతరం మోజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా మోదీ చివరి రోజున దాదాపు రెండు గంటలకు పైగా ప్రసగించారు. ఈ సందర్భంగా మణిపూర్ అంశంతో పాటు అనేక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా స్పందిస్తూ మణిపూర్ చర్చ విపక్ష పార్టీలకు అవసరం లేదని అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే అమిత్ షా పూర్తి వివరాలను అందజేశారని చెప్పారు. అసలు మేం చర్చకు ఆహ్వానిస్తే వారు తిరిగి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. అలాగే మణిపూర్‌లోని అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
పార్లమెంట్‌లో విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మూడు రోజుల పాటు సుధీర్ఘంగా సాగిన చర్చల అనంతరం మోజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా మోదీ చివరి రోజున దాదాపు రెండు గంటలకు పైగా ప్రసగించారు. ఈ సందర్భంగా మణిపూర్ అంశంతో పాటు అనేక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా స్పందిస్తూ మణిపూర్ చర్చ విపక్ష పార్టీలకు అవసరం లేదని అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే అమిత్ షా పూర్తి వివరాలను అందజేశారని చెప్పారు. అసలు మేం చర్చకు ఆహ్వానిస్తే వారు తిరిగి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. అలాగే మణిపూర్‌లోని అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కొంతమంది భారత మాత చావు ఎందుకు కోరుకుంటున్నారో అసలు అర్థం కావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. వీళ్లే రాజ్యాంగం హత్య గురించి మాట్లాడుతారంటూ చురకలంటించారు. ఇప్పుడు వాళ్ల మనసులో ఉన్నదే బయటపడుతోందని పేర్కొన్నారు.
విపక్ష పార్టీలు దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 1966లో మిజోరంలోని సామాన్యులపై కూడా దాడులు చేయించారని ఆరోపించారు. కానీ ఆ దాడులను ఇప్పటికీ దాచారాని అన్నారు. ఆ రాష్ట్రాల అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు. నేను ఇప్పటివరకు దాదాపు 50 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించానని.. 1962 సంవత్సరంలో నెహ్రూ చేసిన ప్రసంగం ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనసుల్ని గుచ్చుకుంటుందని అన్నారు. మిజరోం ఇప్పటికీ కూడా మార్చి 5వ తేదిని నిరసన దినంగా పాటిస్తుందని ఆరోపించారు. విపక్ష పార్టీలది ఇండియా కూటమి కాదని.. అహంకార కూటమని విమర్శించారు. వారు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం కావాలని చూస్తున్నారని అన్నారు. మేం కుటుంబ పాలను వ్యతిరేకమని స్పష్టం చేశారు. విపక్ష పార్టీలు కొత్త దుకాణాలను తెరుస్తున్నారని.. వాటికి కూడా తాళం వేయల్సి వస్తుందని ఆరోపించారు. అసలు కాంగ్రెస్ పాలనలో స్మీమ్‌లు లేవని.. అన్ని స్కామ్‌లే ఉన్నాయని మండిపడ్డారు.
పాకిస్థాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్‌ను కూడా విపక్ష పార్టీలు నమ్మలేదని చురకలంటించారు. అలగే ఇండియాలో తయారైన కరోనా వ్యాక్సిన్ వచ్చినా కూడా వారు విశ్వసించలేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదని.. కశ్మీర్ పౌరులపై కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదని అన్నారు. చివరికి 2028లో కూడా తమపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం పెడతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఇండియా పేదరికంతో మగ్గిపోయిందని.. ఆ పార్టీకి విజన్ లేదని అన్నారు. 2014 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా ఐదో స్థానానికి చేరిందన్నారు. ఎల్‌ఐసీ ప్రైవేటీకరణతో పేదల డబ్బులు పోతాయని ప్రచారాలు చేశారని.. కానీ ఇప్పుడు ఎల్‌ఐసీ ఎంతో పటిష్టంగా ఉందని అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఇండియా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి చేరుకుంటుందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..