Leading News Portal in Telugu

Uttar Pradesh: శివుడికి శిరస్సును సమర్పించిన భక్తుడు.. ఎందుకో తెలుసా..?


భక్తి అంటే గుండెల్లో ఉండాలి కానీ.. మరీ ప్రాణాలు తీసుకునేంత భక్తి ఉండకూడదు. దేవుడిపై భక్తి కోసం దేవాలయాలను సందర్శించడం.. ఘనంగా పూజలు చేయడం.. లేదంటే మాలలు వేయడం చేస్తారు. అంతేకాకుండా దేవుడికి బంగారం, డబ్బుల రూపంలో భారీగా కానుకలు వేస్తుంటారు. తమ కుటుంబాన్ని .. అష్ట, ఆరోగ్య, ఐశ్వర్యాలతో చల్లగా చూడాలంటూ వేడుకుంటారు. కానీ ఇక్కడ ఓ భక్తుడు.. దేవుడి కోసమని తన శిరస్సును సమర్పించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. శివుడి భక్తిలో మునిగిపోయిన ఒక భక్తుడు.. దేవుడు కోసమని తన తలను సమర్పించేందుకు ప్రయత్నించాడు. 28 ఏళ్ల దీపక్ కుష్వాహ వుడ్ కట్టర్ మెషీన్‌లో తల పెట్టాడు. తన తలను శివునికి అంకితం చేయాలనుకుని.. కట్టర్‌ మెషీన్‌లో పెట్టగానే కేకలు వినిపించాయి. దీంతో స్థానికులు ఆ కట్టర్ మిషన్ లో నుంచి యువకుడిని బయటకు తీశారు. అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన లలిత్‌పూర్ జిల్లా సదర్ కొత్వాలి ప్రాంతంలోని రఘునాథ్‌పురా గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై యువకుడి కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని.. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. యువకుడికి బలమైన గాయాలయ్యాయని.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో యువకుడి మెడ నుంచి చాలా రక్తం పోయింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు ముందు యువకుడు ఓ లేఖ రాశాడు. అందులో తన తలను నరికి శివుడికి, విష్ణువుకు అంకితం ఇస్తానని రాశాడు.