మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు-2023 అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 39 మంది అభ్యర్థుల జాబితాలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సన్నిహితులు ఇద్దరికి టికెట్ దక్కింది. మరొకరికి టిక్కెట్ దక్కలేదు.
2018లో జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కాంగ్రెస్ నుండి బీజేపీకి వచ్చిన ఇద్దరు సహచరులపై బీజేపీ విశ్వాసం ఉంచింది. రాబోయే ఎన్నికలలో వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వారికి అవకాశం ఇచ్చింది. ఈ జాబితాలో ఎడల్ సింగ్ కంసనా మరియు ప్రీతమ్ సింగ్ లోధి పేర్లు ఉన్నాయి. అయితే అదే సమయంలో సింధియాతో కలిసి బీజేపీలోకి వచ్చిన రణ్‌వీర్ జాతవ్‌కు టికెట్ దక్కలేదు. ఎడల్ సింగ్ కంసనాకు బీజేపీ నుంచి రెండో అవకాశం దక్కింది. అంతకుముందు సుమావలి ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయగా.. ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు పండిట్ ధీరేంద్ర శాస్త్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రీతమ్ సింగ్ లోధీకి కూడా బీజేపీ పిచోర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అయితే సింధియాతో పాటు బీజేపీలో చేరిన రణవీర్ జాతవ్ పేరు అభ్యర్థుల జాబితాలో లేదు.
మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని నమోదు చేసింది. కానీ తరువాత జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో 2020 సంవత్సరంలో కమల్ నాథ్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది.