Leading News Portal in Telugu

Indian Students: భారతీయ విద్యార్థులకు షాక్‌.. సరైన పత్రాలు లేవంటూ తిరిగి పంపిన అమెరికా


Indian Students: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలకున్న భారతీయ విద్యార్థులకు అమెరికా షాకిచ్చింది. అన్ని పనులు ముగించుకొని.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను వారు వెళ్లాల్సిన విద్యాసంస్థలకు వెళ్లనివ్వకుండా ఆపేసి.. సరైన పత్రాలు లేవని చెబుతూ తిరిగి ఇండియాకు పంపించారు. అమెరికాకు వెళ్లిన 21 మంది భారత విద్యార్థులకు వీసా తనిఖీలు పూర్తయిన తరువాత సరైన పత్రాలు లేవనే కారణంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వారిని స్వదేశానికి తిప్పి పంపారు. ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తితే జైలుకు పంపిస్తామని విద్యార్థులను హెచ్చరించినట్టు బాధిత విద్యార్థులు చెప్పారు. అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగోలోని విద్యార్థులను ఎయిర్‌ ఇండియా విమానంలో భారత్‌కు పంపించారని తెలిపారు. వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు.

Read also: Alert: ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త మొబైల్ పేలిపోవచ్చు

విద్యార్థులు వీసా ప్రక్రియలను పూర్తి చేసినప్పటికీ, యూనివర్సిటీల నుండి అడ్మిషన్లు పొందినప్పటికీ.. చాలా మంది విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ తనిఖీల తర్వాత వారిని వెనక్కి పంపించబడ్డారు. విద్యారు్థల దగ్గర సరైన పత్రాలు లేకపోవడంతోనే వారిని వెనక్కి పంపినట్టుగా అమెరికా ఇమ్రిగ్రేషన్‌ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు సంబందించిన మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చూసిన తర్వాత వారిని తిప్పి పంపినట్టుగా చెబుతున్నారు. భారత్‌కు తిప్పి పంపిన 21 మంది విద్యార్థులు ఐదేళ్లపాటు పాటు అమెరికాలోకి రాకుండా వారిపై ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్ని ప‌త్రాలు స‌క్రమంగా ఉన్నప్పటికీ.. తమను ఎందుకు తిప్పిపంపుతున్నారో అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. భార‌త విదేశాంగ శాఖ అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాల‌ని వేడుకుంటున్నారు. ఈ పరిణామాలతో భారత్ నుంచి అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల్లో సైతం ఆందోళన నెలకొంది. ఇండియాకు తిప్పిన పంపిన విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యను పరిష్కరించేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.