Leading News Portal in Telugu

Punjab: పంజాబ్ మంత్రికి పాముకాటు.. ఔట్ ఆఫ్ డేంజర్



Punjab

పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్‌ సింగ్ బైన్స్‌ పాముకాటుకు గురయ్యారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని స్వయంగా మంత్రి హర్‌జోత్‌ సింగ్‌.. ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి 2 ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఘటన ఆగష్టు 15 రాత్రి జరిగింది. రూపనగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Off The Record: మామ టికెట్ కోసం అల్లు అర్జున్ లాబీయింగ్..?!

హిమాచల్ ప్రదేశ్ లోని ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు కిందికి విడుదల చేస్తుండటంతో పంజాబ్ లోని రూప్‌నగర్, గుర్‌దాస్‌పూర్, హోసియాపూర్, కపుర్తలా, ఫిరోజ్‌పూర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ డ్యామ్‌ల నుంచి విడదలైన నీటితో బియాస్, సట్లేజ్ నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మంత్రి హర్జోత్‌ సింగ్ బైన్స్‌ తన సొంత నియోజకవర్గమైన ఆనంద్‌పూర్ సాహిబ్‌లో సహాయక చర్యలు చేపట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా.. పాముకాటుకు గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు. భగవంతుడు, ప్రజల ఆశీర్వాదంతో తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.