Leading News Portal in Telugu

Social Media : సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు షేర్ చేస్తే.. ఇక జైలుకే..


సోషల్ మీడియాను అందరు వాడేస్తున్నారు.. అయితే ప్రపంచంలో జరిగే వాటిని చూడటం మాత్రమే కాదు.. మనకు నచ్చిన వాటిని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం.. అలాంటి వారికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.. ఏదైన పోస్టు పెట్టే ముందు ఆలోచించాలి. పెట్టిన తర్వాత ఆలోచించడం, డిలీట్‌ చేయడం, సారీ చెప్పడం చేస్తే కుదరదు అని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.. అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు దానికి తగ్గ పర్యవసానం కూడా ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. మనం పెట్టే పోస్టు ఎక్కడి దాక వెళ్తుంది..

ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే అని చెబుతుంది.. ఇటీవల తమిళనాడు మాజీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది… ఓ జర్నలిస్ట్ పై ఓ వ్యక్తి పోస్ట్ ను షేర్ చేశాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆ ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇక ఎమ్మెల్యే చెన్నై కోర్టును ఆశ్రయించారు. అనుకోకుండా జరిగింది. కేసు కొట్టేయాలని అభ్యర్థించారు. దీనికి నిరాకరించిన హైకోర్టు.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. వెంటే ఆ ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2018 ఏప్రిల్‌ 20న తన క్లయింట్‌ కళ్లలో మందు వేసుకోవడం వల్ల ఫేస్‌బుక్‌లో కనిపించిన పోస్టును సరిగా చూడకుండానే షేర్‌ చేశారు అని తన తరుపు న్యాయవాది వాధించారు..

ఆ అభ్యంతకర పోస్టును తొలగించడం తో పాటు, ఆ జర్నలిస్ట్ కు క్షమాపణలు కూడా చెప్పినట్లు ఒప్పుకున్నారు..అనుకోని పొరబాటుగా పరిగణించి క్రిమినల్‌ కేసు కొట్టేయాలని వేడుకున్నారు. దీనిపై ఏకీభవించని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాతో జాగ్రత అవసరమని కన్నెర్ర చేసింది ధర్మాసనం. పోస్టు పెట్టి సారీ చెబితే సరిపోదని తేల్చి చెప్పింది. ఇక దీని పర్యావసానం కూడా ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. అందుకే సోషల్‌మీడియా వాడకం ఎంత అవసరమో.. అంత కన్న ఎక్కువగా పొరపాట్లు కూడా ఉన్నాయి.. ఏదైనా అభ్యంతర పోస్టులను పెట్టే ముందు ఇది ఆలోచించి పెట్టడం మంచిదని అధికారులు హెచ్చరిస్తుంది.. సో తస్మాత్ జాగ్రత్త..