తమ కూతురు వేరొకరితో తరుచూ ఫోన్ లో మాట్లాడుతుందని దారుణానికి ఒడిగట్టాడు ఓ కసాయి తండ్రి. అంతేకాకుండా హత్యకు సహకరించేందుకు తోడబుట్టిన అన్నదమ్ములు కూడా సహకరించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్‌పూర్ తిక్రి గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రోజున 17 ఏళ్ల బాలికను ఆమె తండ్రి, ఇద్దరు సోదరులు గొడ్డలితో నరికి చంపినట్లు తెలిపారు. బాధితురాలు ప్రీతి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అదే గ్రామానికి చెందిన వ్యక్తితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండేదని పోలీసులు పేర్కొన్నారు.
ఆ వ్యక్తితో మాట్లాడటకుండ ఉండేందుకు ప్రీతి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన ఆమె తండ్రి మన్రఖాన్ సింగ్, ఇద్దరు సోదరులు రాధేశ్యామ్ సింగ్ మరియు ఘనశ్యామ్ సింగ్ ఆమెను గొడ్డలితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. తాము నేరం చేసినట్లు అంగీకరించారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఘటనపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్పీ తెలిపారు.