Leading News Portal in Telugu

Delhi: డ్రగ్స్ కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను జైలుకు తరలింపు



Gangstar

పంజాబీ గాయకుడు-రాజకీయవేత్త సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించారు. రూ.195 కోట్ల డ్రగ్స్ కేసులో హై సెక్యూరిటీ వార్డుకు తరలించారు. ఏప్రిల్‌లో పాకిస్థాన్ నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్)కి అప్పగించబడటానికి ముందు, అతను ఢిల్లీలోని తీహార్ జైలులో ఉండేవాడు.

Ganesh Festival: స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఎప్పుడు..?

గత ఏడాది సెప్టెంబర్ 14న గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో కలిసి జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. అందులో భాగంగా.. గుజరాత్‌లోని కచ్ జిల్లా జఖౌ బాంద్రా సమీపంలో సముద్రం మధ్యలో పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ అద్వాలీని, సుమారు రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ‘అల్ తయ్యాసా’ అనే బోటులో ఆరుగురు పాక్ జాతీయులను కూడా అరెస్టు చేశారు.

Geetika Srivastava: పాక్‌లో భారత తొలి మహిళా డిప్యూటీ హైకమిషనర్‌గా గీతికా శ్రీవాత్సవ..

ఇద్దరు ఢిల్లీకి చెందిన వ్యక్తులతో హెరాయిన్‌ను రోడ్డు మార్గంలో ఢిల్లీ, పంజాబ్‌లకు తరలించాలని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఆ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పంజాబ్ జైళ్లలో ఉన్న నైజీరియన్ జాతీయుడితో సహా ఇద్దరు స్మగ్లర్లు నడుపుతున్న రాకెట్‌లో భాగంగా ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు.

Food Poison: మహారాష్ట్రలో 160 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చికిత్స

2021లో మోర్బీ డ్రగ్ సీజ్‌లో లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు భరత్ భూషణ్ అలియాస్ భోలా షూటర్ పాత్ర ఉన్నట్లు గుజరాత్ పోలీసులు కనుగొన్నారు. ఇటీవల జైలులో ఉండగానే మరణించిన భూషణ్ పంజాబ్‌లోని జైలులోనే డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడని ఆరోపించారు.