Varun Gandhi Setairts On Yogi Adityanath: బీజేపీ నేత వరుణ్ గాంధీ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీపైనా, నేతలపైనా ఈ మధ్య సెటర్లు వేస్తు్న్నారు. ట్విటర్ వేదికగా పార్టీకి నష్టం కలిగించే అనేక పోస్టులను ఆయన పెడుతున్నారు. ఇక మరోమారు వరుణ్ గాంధీ అలాంటి పనినే చేశారు. తన నియోజకవర్గమైన పిలిభిత్‌లో పార్టీ కార్యకర్తలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వరణ్ గాంధీ. ఇక ఆ సమావేశంలో సొంతపార్టీపైనే ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ సమావేశంలో వరుణ్ మాట్లాడుతూ ఉండగా ఒక సాధువు ఫోన్ రింగ్ అయ్యింది. అప్పుుడు వరణ్ గాంధీ స్పందిస్తూ ఆయనను ఫోన్ సైలెంట్ లో పెట్టమని ఎవరు అడగొద్దు. ఎందుకంటే సాధువులు ఎప్పుడు సీఎం అవుతారో ఎవరికీ తెలియదు. వారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావచ్చు. అప్పుడు మనకి ఏం జరగుతుందో ఎవరికి తెలుసు అంటూ మాట్లాడారు. ఇప్పుడు వరుణ్ గాంధీ మాట్లాడిన ఈ మాటలు వైరల్ గా మారాయి. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలంగా వరుణ్ సొంతపార్టీ, ఆ పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్‌లోని గోరక్ష పీఠాధీశ్వరుడు అనే సంగతి తెలిసిందే. సీఎం అయిన తరువాత కూడా ఆయన నిరంతరం కాషాయ వస్త్రాలు ధరించే కనిపిస్తారు. సాధువు అయినప్పటికీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాఫియాపై విరుచుకుపడిన యోగి బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధి పొందారు. ఇక వరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇతర నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా గెలుపొందారు. చాలా సంవత్సరాల తరువాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత యోగీ ఆదిత్యనాథ్ కే దక్కుతుంది. మూకదాడులు, హిందు ముస్లిం గొడవలు లాంటి రకరకాల విమర్శలు ఎదుర్కున్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో రెండోసారి అధికారం సాధించారు.