
PM Modi: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ‘ మూడ్ ఆఫ్ ది నేషన్’ ఫలితాలను ప్రకటించాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన స సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీకి సుమారుగా 80 శాతం మంది భారతీయులు ఉన్నారని, ఇందులో చాలా మంది మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచస్థాయిలో భారత పలుకుబడి పెరిగిందని భావిస్తున్నట్లుగా సర్వే వెల్లడించింది.
ఈ సర్వే ఫిబ్రవరి నుంచి మే నెలల మధ్య జరిగింది. 30,800 మంది అభిప్రాయాలను, 23 దేశాలకు చెందిన వ్యక్తుల అభిప్రాయాలను వెల్లడించింది. మొత్తంగా భారతీయులు (79 శాతం) మంది అనుకూలంగా అభిప్రాయాలను కలిగి ఉండగా.. 55 మంది మోడీకి చాలా అనుకూలంగా ఉన్నట్లు తేలింది. 2024 ఎన్నికల్లో మూడోసారి మోడీనే ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్నట్లు వెల్లడించింది. కేవలం 5 శాతం మంది మాత్రమే మోడీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపింది.
ప్రపంచంలో పలుకుబడి:
ప్యూ సర్వే సర్వే ప్రకారం 68 శాతం ఇండియన్స్ ప్రపంచంలో భారతదేశ ప్రభావం పెరిగిందని భావిస్తున్నారు. 19 శాతం తగ్గిందని భావిస్తున్నారు. జీ20లోని మెజారిటీ దేశాలు భారత్ కు అనుకూలంగా ఉన్నాయి. అయితే గత 15 ఏళ్లతో పోలిస్తే యూరపియన్ దేశాల సానుకూల సెంటిమెంట్ భారత్ పై తగ్గిందని తెలిపింది. ప్యూ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ల సానుకూలతను 46 శాతం మంది మధ్యస్తంగా వ్యక్తం చేశారు. 34 శాతం మంది ప్రతికూలంగా ఉన్నారు.
12 దేశాలకు చెందిన వారిని ఇంటర్నేషనల్ వ్యవహారాలపై ప్రధాన మంత్రి మోడీ సామర్థ్యంపై ప్రశ్నించగా.. 40 శాతం మంది విశ్వాసం లేదని, 37 శాతం మంది విశ్వాసం ఉందని చెప్పారు.