Super Blue Moon: ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. రోజూ వచ్చే చంద్రుడిలాగా కాకుండా జాబిల్లి ఇవాళ(ఆగస్టు 30) పెద్దగా, అత్యంత కాంతివంతంగా కనిపించింది. భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినపుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. భూమికి 3.57 లక్షల కిలోమీటర్ల దూరంలో బుధవారం చంద్రుడు దర్శనం ఇచ్చాడు. ఈ క్రమంలో జాబిల్లి తన నిండైన రూపంలో పెద్దగా సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా కనిపించింది. దీన్ని సూపర్ మూన్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఒకే నెలలో ఇలా రెండోసారి కనిపించే ‘సూపర్ బ్లూ మూన్’ పరిణామం చోటుచేసుకోనుంది. అయితే బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్‌లో కనిపించడు. నారింజ రంగులో చందమామ కనిపిస్తుంది. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్ కనిపించింది. కాబట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. సాధారణంగా ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతుంటాయి.
అయితే సాధారణంగా ఒక ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే బుధవారం సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం అయింది. ఈ సూపర్ బ్లూ మూన్ గురువారం ఉదయం 6.46 గంటలకు సూర్యోదయంతో మాయం కానుంది. అయితే వెలుతురు తక్కువగా ఉన్న వేళ.. చంద్రుడు అందంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లో ఉన్నవారు తెల్లవారుజామున ఈ సూపర్ బ్లూ మూన్‌ను చూడటం మంచిదని సూచిస్తున్నారు.
బ్లూ మూన్ అంటే చంద్రుడు నీలి రంగులో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పౌర్ణమి చంద్రుడిని బ్లూ మూన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ మూన్‌లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. బ్లూ సూపర్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతీ పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా వెల్లడించింది. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్‌లో ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్ కనపించనుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మళ్లీ 14 సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.