Leading News Portal in Telugu

Uddhav Thackeray: బిల్కిస్ బానో, రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలి.


Uddhav Thackeray: 2024 లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీ అడ్డుకోవడానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, శివసేన(యూబీటీ) వంటి 26 పార్టీలు ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతిపక్ష కూటమి మొదటి సమావేశం పాట్నాలో, రెండోది బెంగళూర్ లో జరిగాయి. మూడో సమావేశం రేపు, ఎల్లుండి ముంబై వేదికగా జరగబోతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రతిపక్ష కూటమి బీజేపీ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. శివసేన(యూబీటీ) నేత ఉద్దవ్ ఠాక్రే బీజేపీ ఎద్దేవా చేస్తూ.. బిల్కిస్ బానో, రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలని అన్నారు. వారు దేశంలో సురక్షితంగా ఉండాలనే మేం అంతా కలిసి వచ్చామని ఠాక్రే అన్నారు. ఈ సమావేశంలో కూటమి ఉమ్మడి కార్యచరణపై చర్చిస్తామని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు.

సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు ప్రారంభించాల్సి ఉందని, ఈ సమావేశంలో సీట్ల పంపకాల గురించి రాష్ట్ర నాయకులతో మాట్లాడి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని శరద్ పవార్ అన్నారు. ఈ సమావేశంలో కూటమి జెండా, ఎజెండా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాన్ని ఉద్ధవ్ వర్గం శివసేన నిర్వహిస్తోంది.