Jaya Verma Sinha: భారత రైల్వే చరిత్రలో అరుదైన నియామకం జరిగింది. 105 ఏళ్ల రైల్వే చరిత్రలో తొలిసారి ఓ మహిళను రైల్వే బోర్డు సీఈఓ, చైర్‌పర్సన్ గా నియామకం జరిగింది. జయ వర్మ సిన్హాను రైల్వే బోర్డు సీఈఓ, చైర్‌పర్సన్‌గా కేంద్రం నియమించింది.
జయ వర్మ సిన్హా అలహాబాద్ విశ్వవిద్యాలయం విద్యనభ్యసించారు. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS)లో చేరారు.నార్త్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, తూర్పు రైల్వే మూడు రైల్వే జోన్లలో పనిచేశారు. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (IRMS) (ఆపరేషన్స్ & బిజినెస్ డెవలప్‌మెంట్) సభ్యురాలిగా, రైల్వే బోర్డు ఛైర్మన్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి జయ వర్మ సిన్హా నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) ఆమోదించింది.
ప్రస్తుతం రైల్వే బోర్డు సీఈఓగా ఉన్న అనిల్ కుమార్ లాహోటి స్థానంలో సెప్టెంబర్ 1 నుంచి జయ వర్మ సిన్హా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె పదవీ కాలం ఆగస్టు 31,2024తో ముగుస్తుంది. ఇటీవల కాలంలో బాలాసోర్ రైలు దుర్ఘటన సమయంలో సంక్షిష్టమైన సిగ్నలింగ్ వ్యవస్థ గురించి మీడియాకు వివరిస్తూ తొలిసారిగా ప్రముఖంగా కనిపించారు. అంతకుముందు బంగ్లాదేశ్ లోని ఢాకా, కోల్‌కతాలను కలిపే ‘మైత్రి ఎక్స్‌ప్రెస్’ ప్రారంభోత్సవంలో కీలక జయ వర్మ కీలక పాత్ర పోషించారు. ఢాకాలోని భారత హైకమిషన్‌లో రైల్వే సలహాదారుగా నాలుగు సంవత్సరాలు పనిచేశారు.