Ashok Gehlot: కాంగ్రెస్ నేత , రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కి ఆ రాష్ట్ర హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా రాజస్థాన్ హైకోర్టు శనివారం ఈ నోటీసులు జారీ చేసింది. గెహ్లాట్ చేసిన ఈ వ్యాఖ్యలను సుమోటోగా క్రిమినల్ ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఓ న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ ప్రారంభించిన జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అశుతోష్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సీఎంకి నోటీసులు జారీ చేసింది.మూడు వారాల్లో దీనిపై జవాబు ఇవ్వాలని ఆదేశించింది. అంతకుముందు సీఎం అశోక్ గెహ్లాట్ రాజధాని జైపూర్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజుల్లో న్యాయవ్యవస్థలో అవినీతి పెరుగుతోందని, తీర్పుల విసయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే సీఎం చేసిన ఈ వ్యాఖ్యపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ ఇవి తన వ్యక్తిగత అభిప్రాయం కాదని విమరణ ఇచ్చాడు. న్యాయవ్యవస్థను ఎప్పుడూ గౌరవిస్తానని, నమ్ముతానని అన్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా జోధ్‌పూర్ హైకోర్టు, దిగువ కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించి సీఎం వ్యాఖ్యలకు నిరసన తెలిపారు.