Leading News Portal in Telugu

One Nation – One Election: వన్‌ నేషన్‌ -వన్‌ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు.. సభ్యులు ఎవరెవరంటే..!


వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ కమిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం (సెప్టెంబర్ 2) నోటిఫికేషన్ విడుదల చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ ప్రక్రియపై స్పీడ్ పెంచిన కేంద్రం.. ఈ క్రమంలోనే రామ్‌నాథ్‌ కోవింద్‌ ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, సుభాష్ సింగ్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారీ ఉన్నారు.

ఈ కమిటీ పేరును హై లెవెల్ కమిటీ అని.. ఇంగ్లీష్ లో HLC అని పిలుస్తారు. లా అండ్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ నితిన్ చంద్ర ఇందులో భాగం కానున్నారు. నితేన్ చంద్ర హెచ్‌ఎల్‌సి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. దీంతో పాటు కమిటీ సమావేశంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరుకానున్నారు. నిజానికి వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ అంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరుగనున్నాయని అర్థం.