Leading News Portal in Telugu

JP Nadda: కాంగ్రెస్ అంటే దోపిడి, కాంగ్రెస్ అంటే అవినీతి


JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం రాజస్థాన్‌లో ‘పరివర్తన్ సంకల్ప యాత్ర’ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిత్య-ఎల్1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి భారతదేశం (I.N.D.I.A), కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కూటమికి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంపైనే ఆందోళన అని విమర్శించారు. లాలూకి తేజస్విపై ఆందోళన, సోనియాకు రాహుల్‌పై ఆందోళన, అఖిలేష్‌కు డింపుల్‌పై ఆందోళన, ఉద్ధవ్ కు ఆదిత్యపై ఆందోళన, మమతకు ఆమె మేనల్లుడుపై ఆందోళన అని కామెంట్స్ చేశారు.

రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని నడ్డా ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించరని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను సంతోష పెట్టడంలో కాదు.. దోచుకోవడంలో నిమగ్నమై ఉన్నారని నడ్డా పేర్కొన్నారు. ఈరోజు రాజస్థాన్‌లో ఆడబిడ్డలకు భద్రత లేదని అన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలకు ప్రభుత్వం స్వేచ్ఛనిస్తుందని.., ఆ డబ్బును ఢిల్లీకి పంపి ఆ పార్టీ అధినేతల జేబులు నింపుతోందని నడ్డా మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే దోపిడి, కాంగ్రెస్ అంటే అవినీతి, అలాంటి ప్రభుత్వాన్ని బతకనివ్వద్దని అన్నారు. కాంగ్రెస్ అంటే రెడ్ డైరీ.. ఆ రెడ్ డైరీలో ఏముంది.. రాజస్థాన్‌లోని ఆడబిడ్డలపై అత్యాచారాలు, నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇతరులకు రక్షణగా పేరుగాంచిన రాజస్థాన్ ఈరోజు సురక్షితంగా లేదని నడ్డా పేర్కొ్న్నారు.