(INDIA) కూటమి అధికారంలోకి వస్తే ఎల్‌పిజి సిలిండర్‌లను రూ. 500 తక్కువ ధరకు అందజేస్తామని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈ సందర్భంగా జల్‌పైగురిలోని ధుప్‌గురిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రజలకు హామీ ఇచ్చారు. ధుప్‌గురిలో సెప్టెంబర్ 5న ఉప ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలో సీపీఎం-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపింది. కూటమిలో కాంగ్రెస్ మద్దతు ఉన్న సీపీఎం సభ్యుడిని పోటీకి దింపింది. అదే సమయంలో ఉప ఎన్నికలకు టీఎంసి, బీజేపీ వేర్వేరు అభ్యర్థులను నిలబెట్టాయి.
అంతకుముందు గురువారం టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ విషయమై పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతల మధ్య ఇటువంటి సమావేశాలను స్వాగతిస్తున్నామని అన్నారు. ఇలాంటి సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని చెప్పారు. కాషాయ శిబిరాన్ని ఓడించే వ్యూహాలపై చర్చిస్తామని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు TMC ఎంపీ శంతను సేన్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో, బీజేపీపై పోరాటాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యమైన విషయం అని అన్నారు. బిజెపిని ఎదుర్కోవడం కంటే రాష్ట్ర కాంగ్రెస్ తమకు వ్యతిరేకంగా పోరాడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుందని తెలిపారు. అందుకు కేంద్ర కాంగ్రెస్ యూనిట్ అంగీకరిస్తుందని తాము భావించడం లేదని సేన్ అన్నారు.