ఉత్తరప్రదేశ్ లోని బహేరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అరుదైన జన్యుపరమైన రుగ్మత (హార్లెక్విన్ ఇచ్థియోసిస్)తో శిశువు జన్మించింది. అయితే ఆ శిశువు మూడు రోజులు గడిచినా ఇంకా బతికే ఉంది. చిన్నారి అలా పుట్టడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యులు స్కిన్ బయాప్సీ మరియు కెరియా టైమ్ టెస్ట్ కోసం నమూనాలను తీసుకున్నారు. ఓ మహిళకు ప్రసవ నొప్పి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని కమ్యూనిటీ సెంటర్‌కు తీసుకెళ్లారు. బుధవారం అర్థరాత్రి ఆ మహిళ సాధారణ ప్రసవం ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు శరీరం తెల్లగా ఉండి.. చాలా చోట్ల చిరిగిపోయినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా కళ్ళు కూడా పెద్దవిగా ఉన్నాయి. ఇలా పుట్టిన పిల్లలను హార్లెక్విన్ ఇచ్థియోసిస్ బేబీస్ అని వైద్యులు చెబుతున్నారు.
Enforcement Directorate: ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్
మరోవైపు శిశువు పుట్టినప్పటి నుంచి వింత శబ్ధాలు చేస్తున్నాడని.. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతానికి చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిశువు అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పారు. దీంతో తల్లి, బిడ్డను ఇంటికి తీసుకెళ్లగా.. సమాచారం తెలుసుకున్న అక్కడి స్థానికులు.. వింత శబ్దం చేస్తుందని ఆ చిన్నారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
IND VS PAK: కుప్పకూలిన టీమిండియా టాపార్డర్.. విజృంభించిన పాక్ బౌలర్లు
ఇదిలా ఉంటే.. చాలా సందర్భాలలో హార్లెక్విన్ శిశువు మరణం పుట్టినప్పుడు లేదా కొన్ని గంటల తర్వాత సంభవిస్తుందని శిశువైద్యులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ పిల్లలు అకాల పిల్లలు. కొన్ని సందర్భాల్లో, డెలివరీ వ్యవధి పూర్తయ్యే సమయంలో పుట్టినప్పుడు, వారు ఐదు నుండి ఏడు రోజుల వరకు కూడా జీవిస్తారని అంటున్నారు.