Leading News Portal in Telugu

PM Modi: దేశంలో అవినీతి, కులతత్వ, మతతత్వాని చోటు లేదు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..


PM Modi: స్వాతంత్య్రం వచ్చిన 100 ఏళ్ల నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతుందని, అవినీతి, కులతత్వం, మతతత్వానికి చోటు ఉండదని ప్రధాని నరేంద్రమోడీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన అన్నారు.

భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమస్సు గురించి ప్రధాని మాట్లాడారు. మార్గదర్శకత్వం కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తుందని, మన దేశం దృష్టి, ఆలోచన ప్రపంచానికి రోడ్‌మ్యాప్ గా ఉంటుందని అన్నారు. ప్రపంప దేశాల జీడీపీ కేంద్రీకృత దృక్ఫథం మానవ-కేంద్రీకృత దృక్పధంగా మారుతోందని దీనికి భారతదేశం ఉత్ప్రేరకంగా మారుతుందని ప్రధాని అన్నారు.

READ ALSO: Aditya L1 Solar Mission: “ఆదిత్య ఎల్1” తొలి విన్యాసం విజయవంతం..

చాలా కాలం క్రితం వందకోట్ల ఆకలి పొట్టలు కలిగిన దేశంగా చూసేవారని, ఇప్పుడు రెండు బిలియన్ల నైపుణ్యం కలిగిన చేతులు కలిగిన దేశంగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే 1000 ఏళ్లు గుర్తిండిపోయే వృద్ధికి పునాది వేయడానికి ఈ రోజు భారతీయులకు గోప్ప అవకాశం ఉందని అన్నారు.

ప్రతిపక్ష పార్టీలపై ‘ఉచితాల’ను విమర్శిస్తూ.. బాధ్యాతారహితమైన ఆర్థిక విధానాలు, జనాకర్షక విధానాలు స్వల్పకాలిక రాజకీయ ఫలితాలను ఇవ్వగలవు కానీ దీర్ఘకాలికంగా అతిపెద్ద సామాజిక, ఆర్థిక మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. మరోసారి దౌత్యం, చర్చల ద్వారానే సమస్యలని పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు.