Karnataka Teacher: కర్ణాటకలో ఓ టీచర్ క్లాస్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి పాకిస్థాన్‌కు వెళ్లండి.. ఇది హిందూ దేశం అని అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు వారి కుటుంబంతో కలిసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శివమొగ్గ జిల్లాలోని ఓ ఉర్దూ ఇన్స్టిట్యూషన్లో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులు ఆమెపై విచారణ ప్రారంభించారు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ముస్లిం విద్యార్థులపై మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. వాగ్వివాదం సందర్భంగా మంజుల దేవి విద్యార్థులను ‘పాకిస్తాన్‌కు వెళ్లండి’ అని చెప్పిందని ఆరోపించారు. కన్నడ బోధించే, తొమ్మిదేళ్లుగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయురాలిని ఈ సంఘటనతో బదిలీ చేశారు. కొందరు ముస్లిం విద్యార్థులు ఆమెపై అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆరోపించిన ప్రకటనకు ఖచ్చితమైన రుజువు లేనప్పటికీ, విద్యార్థుల ఫిర్యాదుల ఆధారంగా చర్య తీసుకున్నట్లు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి.నాగరాజు ధృవీకరించారు.
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఘటనల తర్వాత మళ్లీ కర్ణాటకలో ఇలాంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ముస్లిం విద్యార్థిని తోటి పిల్లలతో టీచర్ కొట్టించారు. చివరికి పిల్లాడిని దండించాలనే తప్పా మతపరమైన ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఢిల్లీలో తరగది గదిలో ఓ టీచర్ విద్యార్థులను పాక్‌కు వెళ్లాలని సూచించారు. అనంతరం మళ్లీ కర్ణాటకలో ఈ ఘటన జరగడం గమనార్హం.