Leading News Portal in Telugu

Harish Salve: 68 ఏళ్ల వయసులో మాజీ సొలిసిటర్ జనరల్ మూడోసారి పెళ్లి..


Harish Salve: భారతదేశంలో టాప్ లాయర్, మాజీ సొలిసిటర్ జనరల్ గా పనిచేసిన హరీష్ సాల్వే మూడోసారి వివాహం చేసుకున్నారు. 68 ఏళ్ల సాల్వే, త్రినా అనే మహిళను పెళ్లాడారు. అంతకుముందు ఆయనకు రెండుసార్లు వివాహం జరిగింది. మొదటగా హరీష్ సాల్వే మీనాక్షిని వివాహమాడగా.. 2020లో కరోలిన్ బ్రస్సార్డ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. మీనాక్షితో దాదాపుగా 3 దశాబ్దాల వివాహబంధానికి 2020లో ముగింపుపలికి విడాకులు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సాక్షి, సానియా ఉన్నారు.

ప్రస్తుతం సాల్వే త్రినాను పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. లండన్ లో జరిగిన ఈ వివాహ వేడుకలకు నీతా అంబానీ, లలిత్ మోడీ, ఉజ్వల్ రౌత్ వంటి ప్రముఖులు హాజరైనట్లుగా తెలుస్తోంది.

హరీష్ సాల్వే దేశంలో ప్రముఖమైన కేసులకు న్యాయవాదిగా వ్యవహరించారు. గూఢచర్యం కేసులో పాకిస్తాన్ లో అరెస్టైన కులభూషన్ జాదవ్ కేసును న్యాయవాదిగా ఉన్నారు. జాదవ్ కు పాక్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసు ప్రస్తుతం ఇంటర్నేషన్ కోర్టులో ఉంది. ఈ కేసుకు గానూ సాల్వే కేవలం రూ. 1 మాత్రమే లీగల్ ఫీజుగా తీసుకోవడం ప్రశంసలను అందుకుంది.

టాటా గ్రూప్, ముకేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్ వంటి వారు సాల్వేకు క్లయింట్స్ గా ఉన్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ పై కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ వివాదం కేసును కూడా ఈయన వాదించారు. భారత ప్రభుత్వం 2015లో హరీష్ సాల్వేకు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ భూషణ్’ని ప్రకటించింది. 2002లో సల్మాన్ ఖాన్ ‘హిట్ అండ్ రన్’ కేసును కూడా సాల్వేనే వాదిస్తున్నారు.

2018లో కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. నవంబర్ 1999 నుండి నవంబర్ 2002 వరకు భారతదేశ సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన సాల్వే జనవరిలో వేల్స్ మరియు ఇంగ్లాండ్ కోర్టులకు క్వీన్స్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సాల్వే నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. 1992లో భారత సొలిసిటర్ జనరల్ గా నియమించడానికి ముందు ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు.