Sonia Gandhi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ప్రశ్నోత్తరాల సమయం లేకుండా కేంద్రం ఉభయసభల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిసిపి) చైర్‌పర్సన్ సోనియా గాంధీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు పార్లమెంటరీ స్ట్రాలజీ టీంతో భేటీ కానున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉమ్మడి వ్యూహాన్ని అనుసరించడానికి ఇండియా కూటమి నేతలతో భేటీ కానున్నారు. ఇటీవల ఇండియా కూటమిలో పలు పార్టీలు ఫ్లోర్ లీడర్లను నియమించారు. వీరితో ఖర్గే సమావేశం కనున్నారు. ఖర్గే నివాసంలో రేపు రాత్రి 7 గంటలకు పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది.
కేంద్రం ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ నేతృత్వంలో కమిటిని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికలకు కేంద్ర సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియాగాంధీ, ఖర్గేలు సమావేశాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలపై కమిటి ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారు.