జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లా చసానా సమీపంలో సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతంకాగా.. ఓ జవాన్ గాయపడ్డాడు. ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. దీని ఆధారంగానే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపారు. చసానాలోని తులి ప్రాంతంలోని గాలీ సోహబ్‌లో ఎన్‌కౌంటర్ జరుగుతోందని.. పోలీసులు, ఆర్మీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఏడీజీపీ పేర్కొన్నారు. గాయపడిన పోలీసును చికిత్స నిమిత్తం తరలించారు.
Read Also: Pro Pak Slogans: అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు
అంతకుముందు జూలై నెలలో కూడా భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. పూంచ్‌లోని సింధారా ప్రాంతంలో పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. సురన్‌కోట్ బెల్ట్‌లోని సింధరా టాప్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించగా.. ఆ తర్వాత కాల్పులు జరిగాయి. ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్, రాష్ట్రీయ రైఫిల్స్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది ఇతర బలగాలతో పాటు ఆపరేషన్‌లో భాగమయ్యారని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదులు బహుశా విదేశీ ఉగ్రవాదులే.
Read Also: Sagileti katha: అందుకే ‘సగిలేటి కథ’ పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్!
అంతే కాకుండా.. ఆగస్టు నెలలో జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా సైన్యం చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేసింది. బాలాకోట్ సెక్టార్‌లోని ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఒక ఏకే-47 రైఫిల్, రెండు మ్యాగజైన్లు, 30 రౌండ్లు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, పాకిస్థానీ మూలానికి చెందిన కొన్ని మందులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.