Leading News Portal in Telugu

Sale of Woman: రూ.40వేలకు మహిళ విక్రయం.. గదిలో బంధించి..!


Sale of Woman: రూ.40 వేలకు ఓ మహిళను విక్రయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అస్సాంకు చెందిన 35 ఏళ్ల మహిళను ఝుంజునుకు చెందిన వ్యక్తికి అమ్మారు. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం ఆమెను సూరజ్‌గఢ్‌కు తీసుకొచ్చి అక్కడ ఓ ఇంట్లో బందీగా ఉంచారని తెలిపింది. అంతేకాకుండా రాత్రి తనపై దాడి చేశారని.. ఆ తర్వాత ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నట్లు మహిళ పేర్కొంది. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

అంతకుముందు ఆ మహిళ మీడియాతో మాట్లాడుతూ.. తాను అస్సాంలోని హోబైపూర్‌లో నివాసముంటున్నానని తెలిపింది. అలోక్‌బరిలోని ఓ కంపెనీలో మెడిసిన్ ప్యాకింగ్‌ చేస్తున్నానని చెప్పింది. గత నెల ఆగస్టు 8న ఆమె యథావిధిగా రైలులో అలోక్‌బరీకి వెళుతున్నానని.. రైలులో ఓ వ్యక్తిని తనను కలిశాడని చెప్పింది. తనను కంపెనీ దగ్గర వదిలేస్తానని ఆ వ్యక్తి చెప్పాడని.. ఆ తర్వాత ఏమైందో తెలియదు అని పేర్కొంది. కళ్లు తెరిచి చూసేసరికి ఢిల్లీలో ఉన్నట్లు చెప్పింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉంచి రూ.40 వేలకు విక్రయించారని తెలిపింది.

అయితే బాధిత మహిళ బెంగాలీలో మాట్లాడుతుందని సూరజ్‌గర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. చికిత్స అనంతరం పోలీసులకు నివేదిక అందజేస్తానని మహిళ పేర్కొంది. నివేదిక అందిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.