Leading News Portal in Telugu

Assam : ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు..


దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచేత్తుతున్నాయి.. అనేక నగరాలు నీటిలో మునిగాయి.. ఎంతో మంది వరదల్లో చిక్కుకొని ప్రాణాలను కోల్పోయారు.. తెలుగు రాష్ట్రాల్లో వరదల్లో కొట్టుకు పోయి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.. పొరుగు రాష్ట్రమైన అస్సాం పరిస్థితి వరదల కారణంగా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు వరుస రోడ్డు ప్రమాదాలు జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.. మొన్న జరిగిన రోడ్డు ప్రమాదం మరువక ముందే ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది..

అసోంలోని తిన్‌సుకియా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.. మంగళవారం సాయంత్రం కకోపత్తర్ సమీపంలోని బోర్డిరాక్ తినియాలి వద్ద ఈ సంఘటన జరిగిందని, వారి వాహనం అతివేగంతో ట్రక్కును ఢీకొట్టిందని పోలీసు అధికారి తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.

అతి వేగంగా వెళ్తున్న ట్రక్ ను డ్రైవర్ కంట్రోల్ చెయ్యలేక పోయాడు.. దీంతో ఈ ఘోరం జరిగిపోయింది.. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. గతంలో కూడా ఇక్కడే ఎన్నో యాక్సిడెంట్స్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ప్రమాదం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..