Leading News Portal in Telugu

Annamalai: “D అంటే డెంగ్యూ.. M అంటే మలేరియా.. K అంటే.. ” డీఎంకే పార్టీని టార్గెట్ చేసిన అన్నామలై


Annamalai: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. చివరకు ఆయన తండ్రి, సీఎం స్టాలిన్ కూడా కొడుకు వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా ఉదయనిధి వ్యాఖ్యలపై హిందూసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు డీఎంకే పార్టీతో పాటు ఆ పార్టీ ఇండియా కూటమిలో ఉండటంతో డీఎంకేని, కాంగ్రెస్, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తోంది. ఇండియా కూటమి హిందుమతానికి ద్వేషిస్తోందని బీజేపీ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరోవైపు సొంత రాష్ట్రం తమిళనాడులో డీఎంకే పార్టీని బీజేపీ చీఫ్ అన్నామలై ఏకి పారేస్తున్నాడు. సనాతనధర్మాన్ని ఉదయనిధి మలేరియా, డెంగీతో పోల్చడం, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా DMK పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారు. D అంటు డెంగ్యూ.. M అంటే మలేరియా.. K అంటే కోసు(దోమ) అని ఆ పార్టీని విమర్శించారు. రాహుల్ గాంధీ ఒక రాష్ట్రంలో అమర్ గా, రెండో రాష్ట్రంలో అక్బర్ గా, మరో రాష్ట్రంలో ఆంథోనీగా మారారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తన వీడియోలో విమర్శలు గుప్పించారు.

వచ్చే ఎన్నికల్లో డీఎంకే పార్టీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని, బీజేపీ సనాతన ధర్మాన్ని రక్షిస్తామని పోటీ చేద్ధామని అన్నామలై సవాల్ విసిరారు. తమిళ ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్ధామని, 2024లో డీఎంకే తుడిచిపెట్టుకుపోతుందని, ఇది నేను చెప్పడం లేదని మీ కుమారుడు ఉదయనిధి చెబుతున్నారంటూ D అంటే డెంగీ అని, M అంటే మలేరియా అని, K అంటే కోసు(దోమ) అని అన్నారని సెటైర్లు పేల్చారు.

డీఎంకే అధికారం చేపట్టినత తొలి ఏడాది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారు, రెండో ఏడాది సనాతనధర్మాన్ని రద్దు చేయాలని చెప్పారు. మూడో ఏడాది సనాతనాన్ని నిర్మూలించాలని అంటున్నారు, నాలుగో ఏడాది నువ్వు హిందువు అని, ఐదో ఏడాది 90 శాతం డీఎంకే నాయకులు హిందువులే అని చెబుతారని, మీ డ్రామాలు అందరికీ తెలుసని అన్నామలై తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో 17 ఏళ్లుగా ఇలాంటి నాటకాలే జరగుతున్నాయని అన్నారు.