Siddaramaiah: సనాతన ధర్మపై తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఉదయనిధిపై విమర్శలు చేస్తోంది. ఈ వివాదం ముగియకముందే మరో వివాదానికి తెరలేపారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేరళలోని హిందూ దేవాలయంలో తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఆలయంలోకి ప్రవేశించే ముందు తన చొక్కా విప్పమని అడిగితే తాను ఆలయంలోకి ప్రవేశించలేదని అన్నారు. ‘‘నేను ఒకసారి కేరళకు వెళ్లానని.. ఓ ఆలయానికి వెళ్లగా చొక్కా తీసి లోపలికి రమ్మన్నారని.. అయితే తాను అందుకు నిరాకరించానని, బయట నుంచి ప్రార్థించి వచ్చాను’’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. అందర్ని చొక్కాలు తీయమనలేదని కొందరికి మాత్రమే ఇలా చెప్పారని ఆరోపించారు. ఇది అమానవీయమైన చర్యగా అభివర్ణించారు. దేవుడి ముందు అందరం సమానమే అని అన్నారు. సంఘసంస్కర్త నారాయణ గురు 169వ జయంతిని పురస్కరించుకుని బెంగళూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే దక్షిణ భారతదేశంలో కొన్ని దేవాలయాల్లోకి ప్రవేశించే ముందు పురుషుల చొక్కాలు తీసేసి, భుజాలపై అంగవస్త్రంతో ఆలయాల్లోకి ప్రవేశించడం ఆచారంగా వస్తుంది. ఈ ఆచారంపై సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఉదయనిధి స్టాలిన్ ఇలాగే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మ డెంగీ, మలేరియా లాందదని దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యాయి. దేశవ్యాప్తంగా ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.